రూ.7 కోట్ల కొవిడ్‌ బిల్లులకు బ్రేక్‌..?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్‌ బిల్లులపై ఎట్టకేలకు ప్రతిష్టంభన వీడింది. కొవిడ్‌ మూడో దశలో చేసిన ఖర్చులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లు మంజూరు చేసింది.

Updated : 22 Mar 2023 06:39 IST

కాకినాడ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్‌ బిల్లులపై ఎట్టకేలకు ప్రతిష్టంభన వీడింది. కొవిడ్‌ మూడో దశలో చేసిన ఖర్చులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లు మంజూరు చేసింది. వీటికి సమర్పించిన బిల్లులపై అనుమానం రావడంతో కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా ఆడిట్‌కు ఆదేశించారు. మూడు వారాల పాటు కాకినాడ కలెక్టరేట్‌ కేంద్రం ఆడిట్‌శాఖ అధికారులు బిల్లులను తనిఖీ చేశారు. రూ.17 కోట్లకు గాను రూ.14 కోట్ల మేర బిల్లులు రావడం, మిగతా వాటి కోసం ఎంత నిరీక్షించినా సమర్పించకపోవడంతో కాకినాడ కలెక్టర్‌ మొత్తం బిల్లులపై ఆడిట్‌ చేయించారు. దీన్ని పూర్తి చేసిన అధికారులు నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. సక్రమంగా ఉన్న బిల్లులు చెల్లించవచ్చని నివేదికలో పేర్కొన్నారు.

రూ.14 కోట్లకు సమర్పించిన బిల్లులను మూడు విభాగాలుగా విభజించారు. ఎ, బి, సి కేటగిరీల కింద పొందుపర్చారు. ఎ కేటగిరీ బిల్లులకు వెంటనే చెల్లింపులు చేయవచ్చ సూచించారు. బి కేటగిరీ కింద సక్రమైన మార్గంలో కాంట్రాక్టు దక్కించుకోలేదని, వీటికి సంబంధించిన ఆధారాలు చూపాలని, అప్పటి వరకు ఈ బిల్లులు చెల్లించవద్దని నివేదికలో పేర్కొన్నారు. సి కేటగిరీ కింద గుర్తించిన వాటిలో ఒరిజనల్‌ బిల్లులు సమర్పించలేదని, జిరాక్స్‌ కాపీలు ఉన్నాయని, వీటిపై మళ్లీ పరిశీలన జరిపిన తరువాతే చెల్లించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఎ కేటగిరీకి చెందిన బిల్లుల చెల్లింపునకు కాకినాడ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం ద్వారా ప్రక్రియ మొదలుపెట్టారు.  మొత్తం రూ.14 కోట్లలో రూ.7 కోట్ల వరకే చెల్లింపులకు ఆమోదం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మిగతా రూ.7 కోట్లు బి, సి కేటగిరీల్లో ఉన్నాయని, వీటిపై పూర్తి పరిశీలన చేసిన తరువాతే బిల్లులు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  కొవిడ్‌ మూడు దశల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారు. వీటిలో రెండు దశల్లో చేసిన ఖర్చులకు బిల్లులు చెల్లించారు. అప్పట్లో చెల్లింపు చేసిన బిల్లులను ఇప్పుడు నిర్వహించిన ఆడిట్‌లో తనిఖీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు