TSPSC paper leak case : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో 19 మందిని సాక్షులుగా చేర్చిన సిట్‌..

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో 19 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. అసిస్టెంట్‌ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మి, ప్రవీణ్, రాజశేఖర్ వద్ద పనిచేసిన జూనియర్ అసిస్టెంట్‌లను సిట్‌ సాక్షులుగా చేర్చింది.

Updated : 24 Mar 2023 12:51 IST

హైదరాబాద్‌ :  టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో 19 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. అసిస్టెంట్‌ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మి, ప్రవీణ్, రాజశేఖర్ వద్ద పనిచేసిన జూనియర్ అసిస్టెంట్‌లను సిట్‌ సాక్షులుగా చేర్చింది. సాక్షుల జాబితాలో చేర్చిన వారిలో కర్మన్‌ఘాట్‌లోని ఆర్‌ స్క్వేర్‌ హోటల్‌ యజమాని,  సిబ్బంది కూడా ఉన్నారు.

ఈ నెల 4న ఆర్ స్క్వేర్ హోటల్‌లో నీలేష్, గోపాల్‌తో పాటు డాక్యా బస చేశారు. హోటల్‌లో ప్రశ్నాపత్రం చూసి ఇద్దరు నిందితులు ప్రిపేర్‌ అయ్యారు. ఆ తర్వాత నేరుగా పరీక్షా కేంద్రానికి నీలేష్, గోపాల్ వెళ్లారు. హోటల్‌లో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేశారు. మరోవైపు నిన్న అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను ఏడు రోజుల కస్టడీకి సిట్‌ కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని