ఏప్రిల్‌లోనూ సార్టెక్స్‌ బియ్యమే

ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) ద్వారా జిల్లాలోని రేషన్‌ లబ్ధిదారులకు ఏప్రిల్‌ నుంచి బలవర్థక బియ్యం(ఫోర్టిఫైడ్‌ రైస్‌) పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు.

Updated : 27 Mar 2023 05:48 IST

పౌరసరఫరాల సంస్థ గోదాములో సిద్ధంగా ఫోర్టిఫైడ్‌ బియ్యం

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం): ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) ద్వారా జిల్లాలోని రేషన్‌ లబ్ధిదారులకు ఏప్రిల్‌ నుంచి బలవర్థక బియ్యం(ఫోర్టిఫైడ్‌ రైస్‌) పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. దీంతో ప్రతినెలా మాదిరిగానే ఈసారీ సార్టెక్స్‌ బియ్యమే పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి అందించే రేషన్‌ బియ్యానికి సంబంధించి ఇప్పటికే ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి చౌక దుకాణాలకు సరకుల సరఫరా మొదటిపెట్టారు.

జిల్లాలో రేషన్‌ లబ్ధిదారులకు ప్రతినెలా 8,630 టన్నుల బియ్యాన్ని ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. దీనికోసం రాజమహేంద్రవరం డివిజన్‌లోని ఆయా చౌక దుకాణాలకు 4,700 టన్నులు, కొవ్వూరు డివిజన్‌లోని దుకాణాలకు 3,530 టన్నుల వరకు సార్టెక్స్‌ బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ సరఫరా చేస్తుంది. రేషన్‌లో సార్టెక్స్‌ బియ్యం బదులు ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించి జిల్లా పౌరసరఫరా అధికారులకు ఇప్పటికే మౌలిక ఆదేశాలు ఇవ్వడంతో గోదాముల్లో 49 వేల టన్నుల వరకు ఫోర్టిఫైడ్‌ బియ్యం నిల్వలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు ఏమీ లేకపోవడంతో ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీ ఆగింది. వచ్చేనెల రేషన్‌కు సంబంధించి చౌక దుకాణాలకు ప్రస్తుతం స్టార్టెక్స్‌ బియ్యం సరఫరా ప్రారంభించగా ఇంకా 24 వేల టన్నుల వరకు ఈ బియ్యం నిల్వలు ఉన్నాయి. ఇవి అయిదు నెలల వరకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతానికి పీడీఎస్‌ ద్వారా రేషన్‌లో ఫోర్టిఫైడ్‌ బియ్యం పంపిణీకి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు ఏమీ రాలేదని, వచ్చేనెలలో కూడా సార్టెక్స్‌ బియ్యమే పంపిణీ చేయనున్నామని జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రసాదరావు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు