viveka murder case : వివేకా హత్య కేసు ఇంకా ఎంత కాలం విచారిస్తారు?: సీబీఐని ప్రశ్నించిన సుప్రీం

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎంత కాలం విచారిస్తారని సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

Updated : 27 Mar 2023 13:01 IST

దిల్లీ : వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును ఇంకా ఎంత కాలం విచారిస్తారని సీబీఐపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం పేర్కొంది. ‘విచారణాధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండ’ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే ఇప్పుడున్న అధికారిని కొనసాగించండని పేర్కొంది.

సీబీఐ దాఖలు చేసిన సీల్డ్‌ కవర్‌ నివేదిక ఆసాంతం చదివామని ధర్మాసనం పేర్కొంది. కేసు అంతా.. రాజకీయ శత్రుత్వంతో జరిగిందని రిపోర్ట్‌లో రాశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. మెరిట్స్‌ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని పేర్కొన్న ధర్మాసనం.. కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని