MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ లేఖ..

దిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi liquor scam case)లో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)కు ఈడీ జాయింట్ డైరక్టర్ లేఖ రాశారు.

Updated : 28 Mar 2023 14:00 IST

దిల్లీ :  దిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi liquor scam case)లో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)కు ఈడీ జాయింట్ డైరక్టర్ నిన్న లేఖ రాశారు. విచారణలో భాగంగా కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు రావాలని లేఖలో పేర్కొన్నారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో ఈడీ తెలిపింది. దీంతో కవిత తరఫున ఈడీ ముందుకు భారాస లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు