వాయిదాలతో కాలక్షేపం..?
నగరాల్లోని పేద వర్గాలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన టిడ్కో గృహ సముదాయాలకు బాలరిష్టాలు వీడడం లేదు.
టిడ్కో గృహాలకు వీడని రుణ గ్రహణం
లబ్ధిదారుల ఎదురుచూపులు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌టుడే
నగరాల్లోని పేద వర్గాలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన టిడ్కో గృహ సముదాయాలకు బాలరిష్టాలు వీడడం లేదు. గడచిన సార్వత్రిక ఎన్నికల నాటికే లక్ష్యం మేరకు నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నా నేటికీ అవి లబ్ధిదారులకు అందని పరిస్థితి కొనసాగుతోంది. ప్లాట్‌ల కేటగిరీలకు అనుగుణంగా లబ్ధిదారుల వాటా పోనూ మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పించాల్సి ఉంది. రుణ మంజూరు విషయంలో చోటుచేసుకుంటున్న జాప్యంతో గడచిన నాలుగు సంవత్సరాలుగా పూర్తయిన సముదాయాలను సైతం లబ్ధిదారులకు అప్పగించలేని దుస్థితి కొనసాగుతోంది.
కృష్ణా జిల్లా పరిధిలోని మచిలీపట్నం కార్పొరేషన్‌తో పాటు గుడివాడ, ఉయ్యూరు నగరపాలక సంస్థల్లో టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేశారు. పెడన పురపాలక సంఘానికి గృహాలు మంజూరైనా స్థల సేకరణ విషయంలో ఎదురైన ఇబ్బందులతో అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు. ఎంపిక చేసిన స్థలాల్లో తెదేపా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పట్లోనే కొందరు లబ్ధిదారులు తమ వంతు వాటా చెల్లించడంతో పాటు వ్యక్తిగత పరపతితో బ్యాంకుల నుంచి రుణం సమీకరించుకుని వాయిదాలు చెల్లించారు. సంబంధిత నగర కమిషనర్లు, మెప్మా అధికారులు మిగిలిన వారికి బ్యాంకుల నుంచి రుణాలు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలి. రుణ మంజూరు నిబంధనల ప్రకారం సిబిల్ స్కోర్, లబ్ధిదారుల వయోపరిమితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. పరిస్థితి గమనించిన జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా తరచూ బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తూ రుణ మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని పదే పదే కోరుతున్నా కదలిక నామమాత్రమే అవుతోంది. జాతీయ బ్యాంకులు కొంత ఉదారత చూపుతున్నా ప్రైవేటు బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి.
అరవై శాతం లోపే రిజిస్ట్రేషన్లు
మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు పరిధిలో మొత్తం 13,712 మంది లబ్ధిదారులు ఉండగా వీరిలో 8,000 మందికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. దాదాపు 5,000కు పైగా రిజిస్ట్రేషన్లు గుడివాడలోనే అయ్యాయి. మొత్తంమీద ఇప్పటి వరకూ 10,064 మంది లబ్ధిదారులకు రూ.356 కోట్లకు పైగా బ్యాంకులు రుణంగా ఇచ్చాయి. ఇంకా 2000 మందికి పైగా రూ.57 కోట్ల వరకూ రుణం మంజూరు కావాల్సి ఉంది. మచిలీపట్నం, గుడివాడలో సముదాయాల నిర్మాణాలు దాదాపుగా పూర్తికావొచ్చాయి. ఆయా ప్రాంగణాల్లో మౌలిక వసతుల కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఉయ్యూరులో మాత్రం సకాలంలో బిల్లులు మంజూరు చేయడంలేదన్న కారణంతో పనులు నిలిపివేశారు. బ్యాంకు రుణాల మంజూరు విషయంలో చోటుచేసుకుంటున్న ఆలస్యంతో ముఖ్యమంత్రి చేతుల మీద టిడ్కో గృహాల పంపిణీ చేయించే కార్యక్రమం వాయిదాల పర్వంలో కొనసాగుతోంది. నాలుగేళ్లుగా ఎదురుచూపులతో నెట్టుకొస్తున్న లబ్ధిదారులను కనీసం ఈ ఏడాదైనా గృహయోగం కలుగుతుందో లేదో అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి.
తొలగని సంశయాలు
టిడ్కో గృహ నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులు తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. లబ్ధిదారుడు, సంబంధిత నగర కమిషనర్ల హామీతో బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. రుణం ఇచ్చిన రెండేళ్ల అనంతరం లబ్ధిదారులు తీసుకున్న రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించడం ప్రారంభించాలి. అయితే కొందరికి రుణాలు మంజూరు చేయడం, గృహ సముదాయ నిర్మాణాలు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా వాటిని లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ఇప్పటివరకూ ఇచ్చిన వాటికి సంబంధించిన ఈఎంఐలు ఎప్పుడు చెల్లిస్తారో.. ప్రభుత్వం వడ్డీ ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియని పరిస్థితుల్లో మిగిలిన వారికి రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు సంశయిస్తున్నారు.
ఏప్రిల్‌లో పంపిణీ : చిన్నోడు, టిడ్కో ప్రాజెక్టు అధికారి
లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే కార్యక్రమంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మచిలీపట్నం, గుడివాడల్లో సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన పనులు తుదిదశలో ఉన్నాయి. ఏప్రిల్‌లో గృహాలు అప్పగించే అవకాశాలున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!
-
Ts-top-news News
పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి
-
Ap-top-news News
Chandrababu-AP CID: చంద్రబాబు నివాసం జప్తునకు అనుమతి కోరిన ఏపీ సీఐడీ
-
Ts-top-news News
Dharani portal: ధరణిలో ఊరినే మాయం చేశారు