Telangana News: కలుషిత నీరు తాగిన కూలీలు.. 24 మందికి అస్వస్థత

ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడేనికి చెందిన 24 మంది వ్యవసాయ కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు.

Updated : 29 Mar 2023 14:43 IST

వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడేనికి చెందిన 24 మంది వ్యవసాయ కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆ గ్రామానికి చెందిన ఓ రైతు మిర్చి తోటలో పనికి వెళ్లిన కూలీలు భోజనం విరామ సమయంలో సమీపంలోని మరో రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని పైపుల వద్ద నీటిని సేకరించి తాగారు. కొద్దిసేపటికి పలువురు వాంతులు చేసుకోవడం, నాలుక తిమ్మిరిగా ఉండటం, కళ్లు తిరగడంతో ఆందోళన చెందారు. 

ఈ క్రమంలో మిగిలిన కూలీలు ఆరాతీయగా రైతు తన పొలంలోని డ్రిప్‌ పైపులను శుభ్రపరిచేందుకు పాస్ఫరిక్‌ యాసిడ్‌ అనే రసాయన మందును ఉపయోగించారని.. ఆ పైపుల నుంచే నీరు విడిచిపెట్టినట్లు తేలింది. అస్వస్థతకు గురైన కూలీలందరినీ ట్రాక్టర్‌పై వెంకటాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు, సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించారు. ముగ్గురు కూలీలకు తీవ్రస్థాయిలో వాంతులు కావడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అస్వస్థతకు గురైన కూలీలందరికీ సామాజిక ఆసుపత్రిలోనే సేవలందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని