పదోన్నతులు మాకొద్దు!
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నలుమూలల నుంచి మండుటెండలో వందల సంఖ్యలో సెకండరీ గ్రేడ్ (ఎస్‌జీటీ) ఉపాధ్యాయులు గురువారం నగరంలోని జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి తరలివచ్చారు.
70 శాతానికి పైగా నాట్ విల్లింగ్ ఇచ్చిన టీచర్లు
ఖాళీలు, ప్లేస్‌లు చూపకపోవడంతో విముఖత
గుంటూరు డీఈఓ కార్యాలయానికి పదోన్నతి తిరస్కరిస్తూ తరలివచ్చిన ఉపాధ్యాయులు
పదోన్నతుల విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మి పదే పదే మోసపోలేమని, అందుకే వాటిని తిరస్కరిస్తున్నామని ఉపాధ్యాయ వర్గం మండిపడుతోంది. ఈ ఏడాది జనవరిలో పదోన్నతులు ఇచ్చి సబ్జెక్టు టీచర్లుగా పంపారు. ఆ సమయంలో రూ.2500 పారితోషికం ఇస్తామన్నారు. నాలుగు నెలలు సేవలు అందించినా నయాపైసా ఇవ్వకపోగా ఆ పదోన్నతిని రెగ్యులర్ చేయలేదు. ఖాళీలు చూపకుండా తాజాగా మరోసారి పదోన్నతులు ఇవ్వడానికి తెరదీయడంతో ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో వాటికి అయిష్టత చూపారు.
ఈనాడు, అమరావతి: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నలుమూలల నుంచి మండుటెండలో వందల సంఖ్యలో సెకండరీ గ్రేడ్ (ఎస్‌జీటీ) ఉపాధ్యాయులు గురువారం నగరంలోని జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి తరలివచ్చారు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి తీసుకోవడానికి తమకు ఆసక్తి లేదంటూ (నాట్ విల్లింగ్) అధికారులను కలిసి రికార్డుల్లో ఎంట్రీ వేయించుకోవడం గమనార్హం. సాధారణంగా పదోన్నతులు ఎప్పుడొస్తాయా? వాటికి ఎప్పుడు అవకాశం కల్పిస్తారా అని ఎదురుచూస్తారు. ఇందుకు భిన్నంగా ప్రస్తుత పరిస్థితి నెలకొంది. విచిత్రం ఏమిటంటే పదోన్నతులు పిలిచి ఇస్తామన్నా వద్దనే పరిస్థితికి వెళ్లిందంటే లోపం ఎక్కడ ఉందో ఉన్నతాధికారులే గుర్తించాలి.
ఖాళీలు, స్థానాలు చూపకుండా...
ఉమ్మడి గుంటూరులో అసలు ఎంత మంది పదోన్నతులకు అర్హులు? వారు పదోన్నతి కోరుకోవడానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అవి ఏయే పాఠశాలల్లో ఉన్నాయో పారదర్శకంగా తెలియజేయాలి. ఈ వివరాలు విద్యా శాఖ వెబ్‌సైట్‌తో పాటు డీఈఓ, ఎంఈఓ కార్యాలయాల నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. ఇలా చేయడం వల్ల ఉపాధ్యాయులకు తమకు అనుకూలంగా ఆ ఖాళీలు, స్థానాలు ఉన్నాయో లేవో చూసుకుని పదోన్నతి ప్రక్రియలో పాల్గొంటారు. ఇదేమి లేకుండా ముందు పదోన్నతికి సమ్మతి తెలియజేయాలి? ఆ తర్వాతే పదోన్నతి ఖాళీల వివరాలు వెల్లడిస్తామనేలా విద్యా శాఖ తీరు ఉంది. దీంతో స్పష్టత లేని పదోన్నతులు తమకెందుకు అంటూ వందల సంఖ్యలో ఉపాధ్యాయులు విముఖత చూపడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా సుమారు 300 మందికి పైగా ఉపాధ్యాయులు గుంటూరు డీఈఓ కార్యాలయానికి వచ్చి తమకు పదోన్నతి వద్దని అధికారులకు చెప్పినట్లు తెలిసింది. పదోన్నతులు కోరుకున్న వారి సంఖ్య మొత్తం ఉపాధ్యాయుల్లో 15-20 శాతానికి మించి లేరు. ఖాళీలు చాలా వరకు పల్నాడు ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో ఉంటాయని, అక్కడికి ఎలాంటి రవాణా సదుపాయం ఉండదని, అందుకే పదోన్నతి తిరస్కరిస్తున్నామని పలువురు మహిళా ఉపాధ్యాయినులు చెబుతున్నారు. పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే ఇంత గందరగోళం మునుపెన్నడూ చూడలేదని సీనియర్ ఉపాధ్యాయులు తెలిపారు. ప్రస్తుతం ఒకవైపు బదిలీల నిర్వహణకు దరఖాస్తులు కోరడం, అదే సమయంలో పదోన్నతులు ఇవ్వాలనుకోవడం సరికాదని అంటున్నారు. ఒక్కో సబ్జెక్టులో సగటున 100కు పైగా ఖాళీలు ఉంటాయి. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులు పదోన్నతి తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.
చేపట్టాల్సిన విధానమిది...
స్కూల్ అసిసెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించాలి. దీంతో స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలపై ఒక స్పష్టత వస్తుంది. హెచ్‌ఎం పదోన్నతుల ప్రక్రియ ముగియగానే స్కూల్ అసిసెంట్లు, హెచ్‌ఎంలకు బదిలీలు నిర్వహించాలి. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటిల్లోకి అర్హులైన ఎస్‌జీటీలను తీసుకోవడానికి పదోన్నతులు కల్పించాలి. ఇదీ పదోన్నతుల నిర్వహణకు అనుసరించాల్సిన విధానమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. దీనికి వక్రభాష్యం స్కూల్ అసిస్టెంట్లుగా ఎస్‌జీటీలకు పదోన్నతులు ఇవ్వాలనుకోవడం సరైన విధానం కాదని, అందుకే ఎక్కువ మంది స్వీకరించడం లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్పారు. ‘ఖాళీలు, స్థానాలు చూపిస్తే ఇంత మంది విముఖత చూపేవారు కాదు. ప్రస్తుతం బదిలీలు ముగిశాక ఏర్పడిన ఖాళీల్లోనే పదోన్నతులు ఇస్తారు. ఆ ఖాళీలు ఎక్కడ ఉంటాయో, ఒక స్పష్టత లేకుండా పదోన్నతి ఎందుకు కోరుకోవాలని చెప్పి వెనుకంజ వేస్తున్నారని’ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) మాజీ అధ్యక్షుడు జోసఫ్ సుధీర్‌బాబు తెలిపారు.
ఎండలో పిలిపించారు...
కనీసం కుర్చీలు వేయకపోవడంతో మెట్లపైనే..
పదోన్నతులకు సమ్మతి ఇచ్చేవారు, ఇవ్వనివారు అందరూ రావాలని మండుటెండలో గుంటూరు డీఈఓ కార్యాలయానికి రప్పించారు. ఇంతపెద్ద సంఖ్యలో టీచర్లను పిలిచి కనీసం వారు కూర్చోవడానికి బల్లలు, కుర్చీలు, తాగునీరు ఏర్పాటు చేయలేదు. ఎండవేడిమికి తట్టుకోలేక ఎక్కడ కూర్చోవాలో తెలియక ఉపాధ్యాయులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గంటల తరబడి నిలబడలేక కొందరు మెట్ల మీదే అసౌకర్యంగా కూర్చొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Deemed University Status: డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు
-
Ts-top-news News
Delhi Liquor Policy Case: ఈడీ అధికారులు బెదిరించడం వల్లే కవిత పేరు చెప్పారు
-
General News
Odisha Train Accident : అక్కడి వాతావరణం భీతావహం.. ‘ఈనాడు’తో ఏపీ ప్రయాణికులు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
Train Accidents: దశాబ్దకాలంలో జరిగిన పెను రైలు ప్రమాదాలివీ..
-
Ap-top-news News
AP IIIT Admissions 2023: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు వేళాయె