అయ్యో.. అన్నదాత
కొనుగోలు కేంద్రం చేతులెత్తేయడంతో నెల రోజులుగా ధాన్యం కుప్ప పోసి ఎదురుచూసిన అన్నదాతల పాట్లు చెప్పనలవి కావు. అకాల వర్షాలు, తూకం వేసిన ధాన్యం తరలింపునకు లారీలు రాకపోవడం వంటి సమస్యలతో తిప్పర్తి
కొనుగోలు కేంద్రం చేతులెత్తేయడంతో నెల రోజులుగా ధాన్యం కుప్ప పోసి ఎదురుచూసిన అన్నదాతల పాట్లు చెప్పనలవి కావు. అకాల వర్షాలు, తూకం వేసిన ధాన్యం తరలింపునకు లారీలు రాకపోవడం వంటి సమస్యలతో తిప్పర్తి కేంద్రం నిర్వాహకులు కొనుగోళ్లు నిలిపేశారు. దీంతో అక్కడికి అమ్మకానికి ధాన్యం తెచ్చి కుప్పలు పోసిన రైతులు గత్యంతరం లేక వాటిని ట్రాక్టర్ ట్రాలీల్లో ఎత్తుకుని రైసుమిల్లులో నేరుగా అమ్మకానికి సిద్ధమయ్యారు. తమ అవసరాన్ని గుర్తించిన రైసుమిల్లు నిర్వాహకులు అడిగిన కాడికి తరుగుకు అంగీకరించాలని, తాము నిర్ణయించిన ధరకు ఒప్పుకుంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామని సతాయిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగైతే పెట్టుబడి కూడా రాదని మొత్తుకుంటే కొనుగోలుకు నిరాకరిస్తున్నారని వాపోతున్నారు. ట్రాక్టరు ట్రాలీల్లో ధాన్యం నింపుకుని వరుసలో ఉంచి కొనుగోలుకు ఎదురుచూపుల్లో నాలుగైదు రోజులు గడుస్తున్నాయని, ట్రాక్టర్ వెయిటింగ్ ఛార్జీలు భారమవుతున్నాయని పేర్కొంటున్నారు. రైసుమిల్లు నిర్వాహకులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తిప్పర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములో భద్రపరుస్తున్నారు. అక్కడే ఈ ట్రాక్టర్లు వరుసకట్టి కొనుగోలుకు ఎదురుచూస్తున్నాయి.
ఈనాడు, నల్గొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య