odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనాస్థలికి ముగ్గురు అధికారుల బృందాన్ని పంపాలని ఆదేశించారు.

Updated : 03 Jun 2023 10:51 IST

అమరావతి : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనాస్థలికి ముగ్గురు అధికారుల బృందాన్ని పంపాలని ఆదేశించారు. మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందం ఘటనాస్థలికి వెళ్లనుంది. ఆయా కలెక్టరేట్లలో విచారణ విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే అంబులెన్స్‌లు సన్నద్ధం చేయాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవలకు సరిహద్దు జిల్లాల్లో ఆస్పత్రులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని