ఐదు లక్షల కుటుంబాల్లో వెలుగులు
మహా నగరం పరిధిలోకి వచ్చే అయిదు లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
భారీగా పట్టాల పంపిణీకి ఏర్పాట్లు
ఎన్నికల ప్రకటనలోపే పూర్తికి ప్రణాళిక
నెలాఖరు నుంచే ‘డబుల్’ ఇళ్ల పంపిణీ
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: మహా నగరం పరిధిలోకి వచ్చే అయిదు లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు తరువాత రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ పథకాల కింద సంబంధిత కుటుంబాలకు వివిధ రూపాల్లో తోడ్పాటు అందించాలని నిర్ణయించారు. రెండో విడత దళిత బంధుతో పాటు ఏళ్లుగా భూతగాదాలతో ఇబ్బంది పడుతున్నవారికి సంబంధిత ఇళ్ల స్థలాలపై పట్టాలు ఇవ్వడం ద్వారా తోడ్పాటు అందించాలని నిర్ణయించింది. 95 వేల రెండు పడక గదుల ఇళ్లను కూడా రెండు నెలల్లో సిద్ధం చేయమని అధికారులకు ఆదేశాలుందాయి. ప్రస్తుతం సిద్ధంగా ఉన్న ఇళ్లను వచ్చే రెండు నెలల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడేలోపే వీరిందరికీ లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఏళ్లుగా ఉన్న వెతలు తీరేలా.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి వివిధ రకాల భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న లక్షలమంది నగర ప్రజలు హక్కుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివాదాస్పద భూముల్లో రెండున్నర లక్షలమంది ఇళ్లు నిర్మించుకుని కొన్నేళ్లగా నివాసముంటున్నారు. వీరి ఇంటి స్థలాలన్నీ నోటరీలపైనే ఉన్నాయి. ఇలా ఇళ్లు కొనుగోలు చేసినవారి స్థలాలను క్రమబద్ధీకరించాలని సర్కారు నిర్ణయానికి వచ్చింది. రేపోమాపో ఆదేశాలు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. శేరిలింగంపల్లి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్‌తో పాటు మరికొన్ని మండలాల పరిధిలో దాదాపు రెండున్నర లక్షలమంది నోటరీపైనే స్థలాలు కొని ఇళ్లు నిర్మించుకున్నారు. వీరిలో రెండు లక్షలమంది స్థలాలను క్రమబద్ధీకరించి పట్టాలివ్వాలని అధికారులు భావిస్తున్నారు. జీవో నంబరు 58, 59 కింద ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారిలో 45 వేలమంది క్రమబద్ధీకరణకు దరఖాస్తులు పెట్టుకున్నారు. వారిలో అర్హులందరికీ రెండు నెలల్లో పట్టాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ కంఠం భూముల్లో కూడా వేలాది మంది ఇళ్లు నిర్మించుకున్నారు. ఇలాంటి వారిలో కనీసం 50 వేలమంది స్థలాలను క్రమబద్ధీకరించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. నగరంలో లక్ష రెండు పడక గదుల ఇళ్లకు గాను ఇప్పటివరకు అయిదువేల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంకా 95 వేలు పంపిణీ చేయాల్సిఉంది. వీటిలో 60 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ నెలాఖరునుంచే వీటిని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు విడతల దళిత బంధు కింద లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేసే పనిలో అధికారులు ఉన్నారు. మిగిలిన సంక్షేమ పథకాల పంపిణీని సైతం నెల రోజుల్లోనే చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mexico: మెక్సికోలో ట్రక్కు బోల్తా: 10 మంది వలసవాదులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు