కొట్టినా ఇష్టమే.. ప్రశ్నిస్తే సహించలేమంతే
అక్రమార్కులపై చర్యలుండవు. అవినీతి ఆరోపణల్ని అస్సలు పట్టించుకోరు. భూ కబ్జాలకు పాల్పడటం, దురాక్రమించటం ఆ పార్టీలో అసలు నేరాలే కావు.
చెంచిరెడ్డి విషయంలో గప్‌చుప్
పెద్దిరెడ్డి, పోలినేనిపై చర్యలు
ఇదీ వైకాపాలో ‘రాజీ’కీయ మార్కు
అక్రమార్కులపై చర్యలుండవు. అవినీతి ఆరోపణల్ని అస్సలు పట్టించుకోరు. భూ కబ్జాలకు పాల్పడటం, దురాక్రమించటం ఆ పార్టీలో అసలు నేరాలే కావు. వివాదాస్పద భూముల్లోకి ప్రవేశించి దౌర్జన్యాలు, దందాలకు పాల్పడినా పట్టించుకునే వారుండరు. సొంత పార్టీ నాయకులపై దాడులకు పాల్పడినా అధిష్ఠానంలో ఉలుకూపలుకుండదు. కార్యాలయాల్లోకి చొరబడి అధికారులను దూషించినా.. వారిపై ఏకంగా చేయి చేసుకున్నా ఎలాంటి చర్యలుండవు. పైగా అటువంటి చర్యలను ఇష్టంగా స్వీకరించి మద్దతుగా నిలుస్తారు. అదే అవినీతిపై ప్రశ్నిస్తే.. తమ వాళ్లు చేసే తప్పులను ఎత్తి చూపితే మాత్రం సహించలేరు. అటువంటి వారిని ఏకంగా పార్టీ నుంచే పంపించేస్తారు. ఈ విచిత్ర రాజకీయం వైకాపా నాయకులు, శ్రేణుల్లో ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. సగటు పౌరులు ముక్కున వేలేసుకుని విస్తుపోయేలా చేస్తోంది.
ఈనాడు, ఒంగోలు; ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే
అధికార వైకాపాలో జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులపై రెండు రోజుల వ్యవధిలోనే వేటు పడింది. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డిపై మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఒక్కరోజు గడవక ముందే నాగులుప్పలపాడు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావుపై బుధవారం వేటు పడింది. పెద్దిరెడ్డి మార్కాపురంపై దృష్టి సారించి పనిచేసే క్రమంలో ఆ నియోజకవర్గంలో తన దృష్టికి వచ్చిన పలు అక్రమాలను బహిర్గతం చేశారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ భూములకు రక్షణగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. భూముల స్వాహాకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని ప్రకటించారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడిపై వస్తున్న ఆరోపణల్ని వైకాపా అధిష్ఠానం పట్టించుకోలేదు. పెద్దిరెడ్డిని మాత్రం బయటికి సాగనంపారు.
సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్.సుధాకర్‌బాబుకు నాగులుప్పలపాడు మండలం కొరకరాని కొయ్యగా మారింది. ఎంత ప్రయత్నించినా అక్కడ అసమ్మతి జ్వాలలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతగా ఉన్న మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావుపై బహిష్కరణాస్త్రం ప్రయోగించారు.
అంతా ఏకపక్షం...: ఈ రెండు సంఘటనల్లోనూ క్రమశిక్షణ సంఘం సిఫారసు మేరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. ఇక్కడ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలంటే ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. పార్టీలోని నాయకుల అవినీతి, అక్రమాలపై ప్రశ్నించటం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందా..? అనే ప్రశ్న రేకెత్తుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే ఏ పార్టీలోనైనా ఎవరిపై అయినా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే షోకాజ్ నోటీసులివ్వాలి. అభియోగాలను పేర్కొనాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడి వివరణ తీసుకోవాలి. అధిష్ఠానానికి నివేదించి చర్యలకు సిఫారసు చేయాలి. అప్పుడు పార్టీ అధ్యక్షుడు చర్యలు తీసుకుంటారు. వైకాపాలో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నం. కేంద్ర కార్యాలయంలో కొందరు నాయకులు ఏకపక్షంగా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటూ బహిష్కరణలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.
దాడులు చేసినా.. కేసులున్నా ఫర్వాలేదట...: కొండపి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయి విభేదాలున్నాయి. పోటాపోటీ కార్యక్రమాలే కాదు, భౌతికదాడులూ చోటుచేసుకున్నాయి. వీటిపై వైరివర్గం అధిష్ఠానానికి పదేపదే ఫిర్యాదులు చేసింది. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 11న నిర్వహించిన సమీక్షలోనూ ఈ విషయాన్ని లేవనెత్తారు. వీటిపై వైకాపా అధిష్ఠానం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై ఓ వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఆయనకు సన్నిహితంగా ఉండే మాజీ రౌడీషీటర్, నాయకులపై ఈ రెండు నెలల కాలంలోనే నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిపైనా అధికార పార్టీ కనీస చర్యలకు ఉపక్రమించలేదు.
బెదిరించినా.. నగదు వసూలు చేసినా సరేనట..
జిల్లాలో కొందరు అధికార పార్టీ నాయకుల భూదందాలు మితిమీరాయి. ఒంగోలులో శ్రీగిరి కొండపై విలువైన ర.భ. పాత భవనాలను కూల్చేసి స్థలాన్ని చదును చేశారు. అక్కడ పట్టాలు ఇప్పిస్తాని చెప్పి పలువురి నుంచి భారీగా నగదు వసూలు చేశారు. చివరకు ఈ విషయం బహిర్గతం కావడంతో అధికారులు కళ్లు తెరిచారు. ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు పెట్టారు. దురాక్రమణకు పాల్పడిన వారిపై కనీస చర్యలు లేవు. తాజాగా సంతనూతలపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణరెడ్డిపై వైకాపా మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి కార్యాలయంలోనే దాడి చేశారు. ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. కార్యాలయంలో గొంతు పట్టుకుని దాడి చేసి కొట్టినా అధికార పార్టీకి నేరంగా కనిపించక పోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ts Elections: మాకు డబ్బులివ్వరా?.. మిర్యాలగూడలో మహిళా ఓటర్ల ఆందోళన
అన్ని వార్డుల్లో ఓటర్లకు డబ్బులిస్తూ.. తమ వీధిలో మాత్రమే ఇవ్వలేదని ఆరోపిస్తూ మిర్యాలగూడలో పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. -
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Hyderabad: ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు
ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపించారని ముగ్గురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది -
పెంచలకోన జలపాతంలో చిక్కుకున్న అయ్యప్ప భక్తులు క్షేమం
రాపూరు మండలం పెంచలకోనలో ఉన్న జలపాతం సందర్శనకు వెళ్లి గల్లంతైన 11 మంది అయ్యప్ప భక్తులు క్షేమంగా బయటపడ్డారు. -
Ts Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
Ts Elections: ఉపాధ్యాయ సంఘాల పిటిషన్‌పై విచారణ ముగించిన హైకోర్టు
అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించలేదంటూ ఉపాధ్యాయ సంఘాలు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ ముగించింది. -
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Ts Elections: ఓటు వేసేందుకు స్వగ్రామాలకు పయనమైన జనం.. బస్ స్టేషన్లలో రద్దీ
ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్లన్నీ ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. -
AP High Court: సజ్జల, సీఎస్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు
‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంపై జర్నలిస్ట్ కట్టెపోగు వెంకటయ్య వేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. -
Rushikonda: రుషికొండ తవ్వకాలపై పిల్.. హైకోర్టులో విచారణ
విశాఖపట్నంలోని రుషికొండపై అక్రమ తవ్వకాలు, భవన నిర్మాణాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. -
AP High Court: ఏయూలో అవినీతిపై పిటిషన్.. విచారణ 8 వారాల పాటు వాయిదా
ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో నిధుల మళ్లింపు, అవినీతిపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
AP High Court: ఐఆర్ఆర్ కేసు.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా
రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. -
Hyderabad: శంషాబాద్ నుంచి దిల్లీ వెళ్లాల్సిన విమానం రద్దు.. ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో బుధవారం ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. -
Top Ten News @ Election Special: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/11/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్‌తో సినిమా ఉంటుంది: సందీప్
-
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్‌లు
-
Bullet train: తొలి బుల్లెట్ రైలు.. ఆగస్టు 2026 నాటికి 50కి.మీ సిద్ధం!
-
Randeep Hooda: ప్రియురాలిని పెళ్లాడిన రణ్‌దీప్ హుడా.. వధువు ఎవరంటే?
-
Ts Elections: మాకు డబ్బులివ్వరా?.. మిర్యాలగూడలో మహిళా ఓటర్ల ఆందోళన
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు