వీళ్లు కట్టరు.. నిర్మించినవి ఇవ్వరు
గత ప్రభుత్వంలా ఎన్నికలు, ఓట్ల కోసం చివరిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టమని, ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లోనే ప్రారంభించి వెంటనే పూర్తి చేసి పేదవాడు ఆ ఇంటిలో చేరేలా చేస్తామని సీఎం జగన్ అధికారం చేపట్టిన వెంటనే ప్రకటించారు.
పురంలో పేదవాడికి గూడు కల్పిస్తే ఒట్టు!
పునాదులకే పరిమితమైన జగనన్న కాలనీ..
హిందూపురం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వంలా ఎన్నికలు, ఓట్ల కోసం చివరిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టమని, ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లోనే ప్రారంభించి వెంటనే పూర్తి చేసి పేదవాడు ఆ ఇంటిలో చేరేలా చేస్తామని సీఎం జగన్ అధికారం చేపట్టిన వెంటనే ప్రకటించారు. తాము ఇళ్లు కట్టడం లేదని, కాలనీలు, గ్రామాలను కడుతున్నామని, జగనన్న కాలనీల పేరుతో అన్ని సదుపాయాలతో నిర్మిస్తామని ఇళ్ల నిర్మాణాలపై జోరుగా ప్రకటనలు గుప్పించారు. పేదలు తమ పని వదలి పెట్టి ఇంటి నిర్మాణ పనులు చూసుకోవాల్సిన అవసరం లేదని, వారి తరఫున తామే నిర్మిస్తామని ప్రకటించారు. స్థలాల పంపిణీ, లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ పనులు ప్రారంభించడం నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. హిందూపురం పట్టణంలోని పేదలకు ఇళ్ల నిర్మాణానికి గ్రామీణ మండలం కొటిపి వద్ద 6 వేల మందికి ఇంటి స్థలాలు కేటాయించారు. ఇళ్ల నిర్మాణ పనులను తమ పార్టీ ఎమ్మెల్యేకు చెందిన సంస్థకు అప్పగించారు. ఇప్పటి దాక దాదాపు 3వేల ఇళ్లకు ‘ఫైల్’ పద్ధతిలో పునాదులు వేశారు. ఇవి అర్ధాంతరంగానే ఉన్నాయి. పునాది పూర్తి కావాలంటే ‘ఫైల్’ పద్ధతిలో నిర్మించిన నిర్మాణంపై ఇటుకలతో నాలుగు వరుసలు కట్టాలి. పునాది మధ్యలోని ఖాళీ స్థలాన్ని మట్టితో నింపాలి. ఇవేవి చేయలేదు. మరో 3 వేల ఇళ్లకు సంబంధించి ఎలాంటి పనులు జరగలేదు. పనులు పూర్తి స్థాయిలో జరగకపోయినా.. గృహనిర్మాణ శాఖ అధికారులు బిల్లులు మాత్రం చెల్లించారు. ప్రభుత్వ కాలపరిమితి కొన్ని నెలల్లో ముగియనుంది. అప్పటికి కనీసం అన్ని ఇళ్లకు పునాదులు అయినా వేస్తారో లేదో తెలియని దుస్థితి. ఇళ్లు నిర్మించి పేదలకు ఇవ్వడం అనేది మాత్రం అసాధ్యం.
నిరుపయోగంగా టిడ్కో ఇళ్లు
లబ్ధిదారులకు కేటాయించని టిడ్కో ఇళ్లు
గత ప్రభుత్వం పేద వాడికి గూడు కల్పించాలనే ఆశయంతో సకల హంగులతో టిడ్కో ఆధ్వర్యంలో హిందూపురంలో బహుళ అంతస్తుల పద్ధతిలో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. మొదటి దశలో 2,500, రెండో దశలో 7వేల ఇళ్లను నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి దశ పనులు శరవేగంగా సాగాయి. ఏకంగా 1,250 ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. మిగిలిన సగం 90 శాతం పూర్తి అయ్యాయి. రెండో దశ నిర్మాణాలు 25 శాతం పైగా పూర్తి అయ్యాయి. మొదటి దశ దాదాపు పూర్తి కావడంతో వాటిని లబ్ధిదారులకు గత ప్రభుత్వమే కేటాయించింది. విద్యుత్తు, నీటి సదుపాయాలు కల్పించడమే తరవాయి. వాటిని కల్పిస్తే లబ్ధిదారులు అందులో చేరిపోవచ్చు. ఇలాంటి సమయంలో ఎన్నికలు జరిగి వైకాపా ప్రభుత్వం ఏర్పడింది. మౌలిక సదుపాయాలు కల్పించి, నిర్మాణాలు పూర్తి అయినా వాటిలోకి లబ్ధిదారులు చేరేలా చూస్తామని 2019 జూన్ నుంచి చెబుతూనే ఉన్నారు. గడువులు మీద గడువులు ప్రకటిస్తున్నారు. అడుగు ముందుకు పడలేదు. నాలుగున్నరేళ్లలో ఒక్క రూపాయి పని చేయలేదు. ఎంతో నాణ్యతతో కట్టించిన టిడ్కో ఇళ్ల మధ్యలో పిచ్చి మొక్కలు పెరిగాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. కోట్లాది రూపాయల ప్రజా ధనం వృథా అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!