ప్రధాని వచ్చినా.. పాలమూరు రాత మారలే
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినా పాలమూరు రాత మారలేదని, ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని తెలంగాణ జన సమితి(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు.
సత్యాగ్రహ దీక్షలకు మద్దతు తెలిపిన ఆచార్య కోదండరాం
దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరా]ం, చిత్రంలో ఆచార్య హరగోపాల్ తదితరులు
పాలమూరు, న్యూస్‌టుడే : ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినా పాలమూరు రాత మారలేదని, ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని తెలంగాణ జన సమితి(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం మహబూబ్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నేతలు 30 గంటల సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. కోదండరాం హాజరై తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రధాని వస్తే ఏదైనా ప్రత్యేక పథకం ప్రకటిస్తారని, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పిస్తారని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై స్పష్టత ఇస్తారని అందరూ ఆశించినట్లు చెప్పారు. ఒక్క వరాన్ని కూడా ఇవ్వకుండా అందరినీ నిరాశపరిచారని పేర్కొన్నారు. పాలకులు మైనింగ్, ఇసుక, రియల్ ఎస్టేట్‌పైనే దృష్టిసారించారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ద్వారా ప్రజలు కాకుండా ఒక కుటుంబం మాత్రమే లాభపడిందన్నారు. ఆ కుటుంబం కన్నంతా ఆదాయంపైనే ఉందని, ప్రతి దాంట్లో వాటా కావాలని చూస్తోందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియమాకాలు సాధించుకునేందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించామని, ఇప్పుడు అస్తిత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాలన్నారు.
మరో ఉద్యమానికి సిద్ధం కావాలి : హరగోపాల్
పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ఆచార్య హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఆశయాలు నెరవేరలేదన్నారు. నాటి సమస్యలే మరింత పెద్దగా మారాయన్నారు. సాగరహారం, సకల జనుల సమ్మె, వంటవార్పు, ధూంధాం తదితరాలతో ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రజలు, ఉద్యోగులు, అన్ని సంఘాల వాళ్లు తీవ్రంగా శ్రమించారని గుర్తుచేశారు. ప్రస్తుతం మేధావులు, ప్రశ్నించేవారు ఏదైనా కార్యక్రమానికి తలపెడితే పోలీసులు అనుమతించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నాడు ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకులే ఇప్పుడు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు పాలిస్తున్నారని, వారికి రాజ్యాంగంపై గౌరవం లేదని మండిపడ్డారు. మరో ఉద్యమానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. దీక్షల్లో పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం.రాఘవాచారి, నాయకులు తిమ్మప్ప, వనమాల, రవి, కేసీ వెంకటేశ్వర్లు, వెంకట్‌గౌడ్, నారాయణ, కర్ణకోట రవీంద్రానాద్, నర్సింహులు, ఇక్బాల్ పాషా, రాజేంద్రబాబు, స్వామి, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
నాగార్జునసాగర్ కుడి కాలువ (Nagarjuna Sagar right canal) నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. -
TTD: వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు: ఈవో ధర్మారెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
Nagarjuna Sagar: సాగర్ వద్ద కొనసాగుతున్న పహారా.. ఏపీ పోలీసులపై కేసు నమోదు
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. -
గ్రానైట్‌పై విద్యుత్తు పిడుగు
‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’ -
‘అన్ని మండలాల్లోనూ కరవు’
జిల్లావ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొందని, తక్షణం అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
CM Kcr: ఎగ్జిట్ పోల్స్‌తో పరేషాన్ కావొద్దు.. మళ్లీ భారాసదే విజయం: సీఎం కేసీఆర్
-
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 20,250 ఎగువన రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్‌కు ఏకంగా సీఐఏ చీఫ్‌ను పంపిన బైడెన్!
-
కాంగ్రెస్‌కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్‌పై సంజయ్ రౌత్
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్‌పై రూ.21 పెంపు