అది.. అత్యాచారం కాదు

వివాహం చేసుకుంటానని నమ్మించి, శారీరక సంబంధాన్ని పెట్టుకుని కొన్నేళ్ల అనంతరం మాట తప్పితే అది అత్యాచారం కింద కేసు నమోదు చేయడం కుదరదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Updated : 13 Jun 2024 06:18 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : వివాహం చేసుకుంటానని నమ్మించి, శారీరక సంబంధాన్ని పెట్టుకుని కొన్నేళ్ల అనంతరం మాట తప్పితే అది అత్యాచారం కింద కేసు నమోదు చేయడం కుదరదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సహజీవనం, ప్రేమ పేరిట ఒక్కటై, ఆ తర్వాత కేసులు పెట్టడం సరికాదని జస్టిస్‌ ఎం.నాగప్రసన్న పేర్కొన్నారు. అమెరికాలో స్థిరపడిన కుందాపుర తాలూకా పక్లాడి గ్రామానికి చెందిన సంతోశ్‌ శెట్టిపై ఒక మహిళ అత్యాచారం, వారి కుటుంబ సభ్యులపై వంచన కేసును నమోదు చేసింది. సంతోశ్‌ శెట్టిని అరెస్టు చేయాలని దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును న్యాయస్థానం కొట్టి వేసింది. సంతోశ్‌శెట్టి, ఆ మహిళకు 2023 జనవరి 11న వివాహ నిశ్చితార్థం జరిగింది. శుభలేఖలు ముద్రించిన అనంతరం లాంఛనాల విషయంలో పట్టింపు రావడంతో వివాహం నిలిచిపోయింది. ఎంగేజ్‌మెంట్ జరిగిన రోజు తనతో సంతోశ్‌ శెట్టి శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారని, తనపై అత్యాచారం జరిగిందని కుందాపుర ఠాణాలో కేసు నమోదు చేసింది. దిగువ కోర్టు ఆదేశాలను ప్రశ్నిస్తూ అర్జీదారుడు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని