సిట్ వద్దే తేల్చుకోండి

లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలతో అరెస్టయిన హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కేసు దర్యాప్తును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఉన్నత న్యాయస్థానం ముందుకు ఓ కేసు వచ్చింది.

Updated : 13 Jun 2024 06:20 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలతో అరెస్టయిన హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కేసు దర్యాప్తును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఉన్నత న్యాయస్థానం ముందుకు ఓ కేసు వచ్చింది. కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్‌హెచ్‌ లింగేగౌడ వేసుకున్న సంబంధిత పిటిషన్‌ విచారణను జస్టిస్‌ ఎస్‌ఆర్‌ కృష్ణకుమార్‌ చేపట్టారు. ప్రజ్వల్‌పై తాను హొళెనరసీపుర ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు విఫలయత్నం చేశానన్నారు. పోలీసులు ప్రజ్వల్, అతని కుటుంబ సభ్యులకు మద్దతుగా వ్యవహరిస్తున్నట్లు అనుమానం ఉందన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థకు విచారణ అప్పగించాలని పిటిషనర్‌ వాదించారు. దర్యాప్తును ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు దళం చేస్తున్న నేపథ్యంలో వారికే దరఖాస్తు దాఖలు చేసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించి, అర్జీని పరిష్కరించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని