సర్కారు బడుల్లోనే నాణ్యమైన బోధన

ప్రభుత్వ పాఠశాలల్లోనే డీఎస్సీ అర్హతతో ఉద్యోగాలు సాధించిన అత్యున్నతమైన ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేస్తారని జిల్లా కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు.

Updated : 13 Jun 2024 05:32 IST

సిద్దిపేటలో పాఠశాలకు హాజరైన విద్యార్థినులు 

కొండపాక గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లోనే డీఎస్సీ అర్హతతో ఉద్యోగాలు సాధించిన అత్యున్నతమైన ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేస్తారని జిల్లా కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. బుధవారం కొండపాక మండలం దుద్దెడ జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట పాఠశాల పునఃప్రారంభానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి కేకుకోసి, ఉచిత దుస్తులు, పాఠ్య, రాత పుస్తకాలు పంపిణీ చేశారు. బడిబాట కార్యక్రమంతో.. దుద్దెడలో ఇతర పాఠశాల్లో చదువుతున్న 66 మంది విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేరడం, పదోతరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో ఉపాధ్యాయులను అభినందించారు. తాను మంచిర్యాల జిల్లాలోని దేవపూర్‌ అనే మారుమూల గ్రామంలో చదువుకున్నానని.. క్రమశిక్షణ, శ్రద్ధతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన విధంగా చదువుకుంటే ఉన్నతంగా ఎదగవచ్చని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, డీపీవో దేవకీదేవి, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మంచాల అనసూయ, హెచ్‌ఎం లక్ష్మీ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. కొండపాకలో ఎంపీపీ మంచాల అనసూయ, డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి హమీనాబేగం జడ్పీ బాలుర, జడ్పీ బాలికల ఉన్నతపాఠశాలల పునఃప్రారంభంలో పాల్గొన్నారు. 

ఇందిరానగర్‌ పాఠశాలలో ఆడుకుంటున్న బాలలు 

మిరుదొడ్డి: అక్బర్‌పేట-భూంపల్లి మండలం కూడవెల్లి ప్రాథమిక పాఠశాలలో తొలిరోజు విద్యార్థులకు  ప్రధానోపాధ్యాయులు పి.వి. సత్యకుమార్, ఉపాధ్యాయులు వెల్‌కమ్‌ జ్యూస్‌తో స్వాగతం పలికారు. మిరుదొడ్డి మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో విద్యార్థులకు వెల్‌కమ్‌ జ్యూస్‌ అందజేశారు. 
హుస్నాబాద్‌: పట్టణంలో 76 వసంతాలు పూర్తి చేసుకున్న జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను ఆకట్టుకునే విధంగా కొబ్బరి, మామిడి ఆకులు, బెలూన్లు కట్టి అలంకరించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ప్రధాన ద్వారం వద్దనే ప్రధానోపాధ్యాయుడు వాసుదేవరెడ్డి, ఇతర ఉపాధ్యాయ బృందం చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు.

పాఠశాలలో ఏడుస్తున్న చిన్నారి


పట్టుదలతో చదవాలి: ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి 

సిద్దిపేట అర్బన్, న్యూస్‌టుడే: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. సిద్దిపేట గ్రామీణ మండలం ఇర్కోడు ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేశారు. ప్రిన్సిపల్‌ బుచ్చిబాబు పాల్గొన్నారు. 

నంగునూరు: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి అన్నారు. నంగునూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. 

కూడవెల్లిలో విద్యార్థులకు అందజేసిన వెల్‌కమ్‌ జ్యూస్‌

సిద్దిపేట ఇందిరానగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలకు వస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని