ఎంపీలు... నాలుగు జిల్లాల ప్రతినిధులు

మన ఎంపీˆలు ఒక్కొక్కరూ నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విసీˆ్తర్ణంలో చాలా పెద్దది. దాని పరిధిలోనే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానాలు ఉండేవి.

Updated : 13 Jun 2024 05:40 IST

డి.కె.అరుణ

న్యూస్‌టుడే, కోస్గి: మన ఎంపీˆలు ఒక్కొక్కరూ నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విసీˆ్తర్ణంలో చాలా పెద్దది. దాని పరిధిలోనే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానాలు ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, జిల్లాల పునర్విభజనలో మహబూబ్‌నగర్‌ జిల్లా లోని ప్రాంతాలు ఏడు జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలతో పాటు కొన్ని ప్రాంతాలు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో జిల్లాకు చెందిన ఒక్కొక్క ఎంపీ ఇప్పుడు నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. 

మహబూబ్‌నగర్‌ ఎంపీˆ పరిధిలో..

మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల, మక్తల్, నారాయణపేట, కొడంగల్, షాద్‌నగర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోనూ, మక్తల్, నారాయణపేట కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు ప్రాంతాలు నారాయణపేట జిల్లా పరిధిలో ఉన్నాయి. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట ప్రాంతాలు వికారాబాద్‌ జిల్లాలో ఉన్నాయి. షాద్‌నగర్‌ రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. ఈ మధ్య గెలుపొందిన ఎంపీˆ డీకే అరుణ నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది.

నాగర్‌కర్నూల్‌ ఎంపీ పరిధిలో..

నాగర్‌కర్నూల్‌ ఎంపీˆ పరిధిలో వనపర్తి, గద్వాల, అలంపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో వనపర్తి నియోజకవర్గం వనపర్తి జిల్లా పరిధిలో, గద్వాల, అలంపూర్‌లు జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌తో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని కొంత భాగం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉంది. కల్వకుర్తిలోని తక్కిన భాగం రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లింది. ఇటీవల నాగర్‌కర్నూల్‌ ఎంపీగా గెలుపొందిన మల్లు రవి నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది. 

మల్లు రవి 

ఇబ్బందులూ ఉన్నాయి

పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక ఎంపీ పరిదిని ఒక జిల్లాగా విభజించారు. నిధులు, ఇతర పరిపాలన అంశాలు ఒకే జిల్లా యంత్రాంగం నుంచి అమలవుతాయి. మనదగ్గర అటు ఎంపీలకు, ఇటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎంపీ పరిధి ఎక్కువ జిల్లాలకు విస్తరించడంతో ప్రధానంగా ప్రోటోకాల్‌ సమస్య వస్తోంది. ఇక చేపట్టిన పనిని బట్టి ఆయా జిల్లాల అధికారులకు సమాచారం ఇవ్వాలి. అన్ని జిల్లాలకు చెందిన పని అయితే అధికారులను సమన్వయపరుస్తూ సమావేశాలు నిర్వహించాలి. ఏదైనా ఒక సమస్య పరిష్కరించాలంటే ఆయా జిల్లాల యంత్రాంగాల సన్నద్ధత కూడా వేరువేరుగా ఉంటుంది. పనులు చేపట్టడం ఇబ్బంది కలిగిస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఇబ్బంది లేని విధానం అనుసరిస్తే మేలన్న అభిప్రాయం కలుగుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని