ఎమ్మెల్యే పదవులకు కుమార, బొమ్మై రాజీనామా

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రస్తుత విధానసభ సభ్యులు సాంకేతికంగా ఒకే పదవి అంటిపెట్టుకోవడానికి వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Updated : 16 Jun 2024 06:44 IST

విధానసభ సభ్యత్వానికి రాజీనామా పత్రాలను స్పీకర్‌ యూటీ ఖాదర్‌కు అందజేస్తున్న కుమారస్వామి

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రస్తుత విధానసభ సభ్యులు సాంకేతికంగా ఒకే పదవి అంటిపెట్టుకోవడానికి వీలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే పదవులకు వరుసగా రాజీనామా చేస్తున్నారు. మండ్య ఎంపీగా నెగ్గిన హెచ్‌.డి.కుమారస్వామి శనివారం చెన్నపట్టణ విధానసభ స్థానానికి రాజీనామా చేశారు. హావేరిలో నెగ్గిన శిగ్గావి ఎమ్మెల్యే బసవరాజ బొమ్మై ఇదే తరహాలో స్పందించారు. వారిద్దరూ విధానసభలో స్పీకర్‌ యూటీ ఖాదర్‌ను కలసి రాజీమానా పత్రాలు సమర్పించారు. కుమారస్వామి వెంట జేడీఎస్‌ నేతలు జీటీ దేవేగౌడ, బోజేగౌడ ఉన్నారు. బొమ్మై వెంట ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక్, భాజపా ఎమ్మెల్సీ రవికుమార్‌ తదితరులు కదిలారు. వారిద్దరికీ స్పీకర్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన కేంద్ర మంత్రి కుమారస్వామి తన కుటుంబ సభ్యులతో తిరుమలకు పయనమై వెళ్లారు.

విధానసభ సభ్యత్వానికి రాజీనామా పత్రాలను స్పీకర్‌ యూటీ ఖాదర్‌కు అందజేస్తున్న కుమారస్వామి బసవరాజ బొమ్మై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని