మద్యం తాగుతూ విధులు.. ఆర్టీవో ఆఫీసులో ఉద్యోగి నిర్వాకం

మహబూబాబాద్‌ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలోని ఉద్యోగుల నిర్వాకం రోజురోజుకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

Updated : 19 Jun 2024 07:03 IST

నెెహ్రూసెంటర్, హసన్‌పర్తి, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలోని ఉద్యోగుల నిర్వాకం రోజురోజుకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.  గత నెలలో ఏసీబీ అధికారులు దాడులు చేసి రవాణాశాఖ అధికారి గౌస్‌పాషా డ్రైవర్‌ వద్ద అక్రమంగా నిల్వ ఉన్న డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రైవర్‌ను సస్పెండ్‌ చేశారు. ఆ ఘటన మరవకముందే అందులో పొరుగుసేవల విధానంలో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఒకరు కార్యాలయంలోనే మద్యం తాగుతూ విధులు నిర్వహించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రవాణాశాఖ అధికారి ఛాంబర్‌లో ఉద్యోగి ఒకరు విధులు నిర్వర్తిస్తూనే టేబుల్‌పై బీరు సీసా పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మద్యాన్ని ఒక ఏజెంట్‌ ద్వారా తెప్పించుకున్నాడని.. అది గుర్తించిన కొందరు ఆ ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు తెలిసింది. కాగా,  మహబూబాబాద్‌ ఆర్టీవో కార్యాలయంలో మద్యం తాగుతూ అసభ్యంగా ప్రవర్తించిన ఔట్‌ సోర్సింగ్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజినీర్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఉప కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై ఆ జిల్లా రవాణా శాఖాధికారి (డీటీవో) గౌస్‌పాషాపై తదుపరి విచారణ కోసం కమిషనర్‌కు నివేదిక సమర్పించినట్లు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని