పేరు ఘనం.. పరిష్కారం గగనం

వైఎస్‌ఆర్‌ తాడిగడప మున్సిపాలిటీ అంటూ గత ప్రభుత్వం పేరు పెట్టడం తప్ప.. అక్కడ ప్రజలకు సౌకర్యాల కల్పనపై కొంచెం కూడా దృష్టి పెట్టలేదు.

Updated : 21 Jun 2024 06:07 IST

ఈనాడు, అమరావతి : వైఎస్‌ఆర్‌ తాడిగడప మున్సిపాలిటీ అంటూ గత ప్రభుత్వం పేరు పెట్టడం తప్ప.. అక్కడ ప్రజలకు సౌకర్యాల కల్పనపై కొంచెం కూడా దృష్టి పెట్టలేదు. రహదారులు వేయక, కాలువలు తీయక, మురుగుతో ఎంత అధ్వానంగా ఉంటాయో వర్షం పడితే అసలు రంగు తెలుస్తుంది. కాలువల్లో మురుగునీరు పోయే మార్గం లేక, నీరు రోజుల తరబడి స్థానికుల ఇళ్లలోనే నిలిచిపోతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కాలువలు పూడిపోయినా పట్టించుకునే నాథుడే లేడు. ఖాళీ స్థలాల్లో నీరు నిలబడకుండా, తుప్పలు పెరగకుండా మెరక చేయించుకోవాలని, లేదంటే చట్టరీత్యా చర్యలు చేపడతామని ఉమాశంకర్‌నగర్‌ 4వ వీధిలో మున్సిపాలిటీ పేరున బోర్డు ఏర్పాటు చేసినా ఆ స్థల యజమాని నుంచి స్పందనేలేదు. వారిపై మున్సిపాలిటీ చర్యలు చేపట్టిందీలేదు. కనీసం నూతన ప్రభుత్వంలోనైనా అధికారులు ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని