నదిని దాటుతున్న ఏనుగుల సమూహం.. వైరల్‌గా మారిన వీడియో

అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిని ఓ ఏనుగుల సమూహం దాటుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. 

Updated : 24 Jun 2024 23:14 IST

ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిని ఓ ఏనుగుల సమూహం దాటుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అన్నీ ఒకేసారి నీటిలోకి దిగి వెళ్తుండటాన్ని గమనించిన ఓ ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాలో ఈ దృశ్యాలను బంధించాడు. అందులో 100కు పైగా ఉన్న ఏనుగుల శరీరం పైభాగం మాత్రమే కనిపిస్తోంది. డ్రోన్‌ కెమెరాతో తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.

ఐఆర్‌సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో ఇతరులకు టికెట్‌ బుక్‌ చేస్తే చిక్కులే!

దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేసే ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహూ సైతం దీనిపై స్పందించారు. ఇది చాలా అద్భుతమైన వీడియో అని కొనియాడారు. తక్కువ సమయంలోనే ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు