బైకు రేసింగ్‌లకు అడ్డుకట్టేదీ?

రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీ, టీహబ్‌ రోడ్లపై వారాంతాల్లో బైకు రేసింగ్‌లకు అడ్డుకట్ట పడడంలేదు. రేసింగ్‌లో పట్టుబడితే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని పోలీస్‌లు హెచ్చరించినా ఫలితం శూన్యం.

Updated : 24 Jun 2024 03:13 IST

శనివారం అర్ధరాత్రి యథేచ్ఛగా ఆకతాయిల విన్యాసాలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీ, టీహబ్‌ రోడ్లపై వారాంతాల్లో బైకు రేసింగ్‌లకు అడ్డుకట్ట పడడంలేదు. రేసింగ్‌లో పట్టుబడితే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని పోలీస్‌లు హెచ్చరించినా ఫలితం శూన్యం. శనివారం అర్ధరాత్రి యథేచ్ఛగా ఆకతాయిలు హంగామా సృష్టించారు. రాత్రి 11.30 నుంచి అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకూ విన్యాసాలు చేశారు. టీహబ్‌ ఐటీ క్షేత్రంలోకి ప్రవేశించేందుకు ఐదారు దారులు ఉండగా కేవలం అరవిందో గెలాక్సీ వైపు మార్గం వద్దే ఐదారుగురు పోలీసులు మాటు వేస్తున్నారు. 

సందర్శకులూ భారీగానే.. వారాంతాల్లో ఐటీ కార్యాలయాలన్నీ మూసి ఉంటాయి. రద్దీ ఉండదు. దీంతో బైకువీరులు గెలాక్సీ రోడ్డు, మైహోం భూజా, సత్వా ఐటీ భవనం వైపు చేరుకున్నారు. సందర్శకులూ భారీగా తరలివచ్చారు.

బాలురు, ట్రిపుల్‌ రైడింగ్‌లు.. అక్కడకి వచ్చే ప్రతి వాహనంపై ముగ్గురేసి చొప్పున ఉంటారు. బాలలు కూడా ఉంటారు. ఒక్క పోలీసు ప్యాట్రోల్‌ వాహనం గస్తీ తిరగలేదు. ఆకతాయిలు టీహబ్‌ దారుల్లోకి ప్రవేశించకుండా అడ్డంగా పెట్టేందుకు బారికేడ్లు లేక డ్రైవర్లను ఒప్పించి ఆటోలు, ట్రాక్టర్లను అడ్డుగా పెట్టారు. ఐటీ కారిడార్‌లో శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం అర్ధరాత్రి దాటాక 2, 3 గంటల వరకూ ఎవరు ఏం చేసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు కూడా నిర్వహించరు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని