కండల కోసం ఇంజక్షన్లు

నిబంధనలకు విరుద్ధంగా ఉత్ప్రేరకాలు విక్రయిస్తున్న బండ్లగూడకు చెందిన మహ్మద్‌ షా ఫహాద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు మంగళవారం సీసీఎస్‌ డీసీపీ శ్వేత తెలిపారు.

Updated : 26 Jun 2024 07:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా ఉత్ప్రేరకాలు విక్రయిస్తున్న బండ్లగూడకు చెందిన మహ్మద్‌ షా ఫహాద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు మంగళవారం సీసీఎస్‌ డీసీపీ శ్వేత తెలిపారు. యువకులు కండలు పెంచేందుకు వీటిని ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. ఇతడి నుంచి 190 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలకు నిందితుడిని, ఇంజక్షన్లను చార్మినార్‌ జోన్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. సీసీఎస్‌ ఏసీపీ జి.వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ డి.బిక్షపతి బృందం దాడులు నిర్వహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు