Google: గూగుల్‌లో తప్పులు కనిపెట్టినందుకు రూ.66 కోట్లు!

కొందరికి ఎదుటివారిలో తప్పులను వెతకడం అలవాటు. 

Updated : 19 Feb 2022 10:12 IST

కొందరికి ఎదుటివారిలో తప్పులను వెతకడం అలవాటు. అమన్‌ పాండేకి మాత్రం వెబ్‌సైట్లు, యాప్‌లలో ఉండే తప్పులను వెతికిపట్టుకోవడం సరదా. అదే అతణ్ని కోటీశ్వరుణ్ని చేసింది. గూగుల్‌లో 300 బగ్‌లను కనిపెట్టినందుకు ఆ సంస్థ అతడికి రూ.66 కోట్లు ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో జన్మించిన అమన్‌ పాండే.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ ఎన్‌ఐటీలో బీటెక్‌ చేశాడు. బగ్స్‌ మిర్రర్‌ అనే సంస్థను ప్రారంభించి 15 మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. గతేడాది గూగుల్‌లో ఉన్న బగ్‌లను కనిపెట్టి సమాచారమివ్వడానికి ఆ సంస్థ నుంచి ఓ ప్రాజెక్టు తీసుకున్నాడు. ఒక్క ఏడాదిలోనే 300 తప్పులను కనిపెట్టి రూ.66 కోట్లు అందుకున్నాడు. యాపిల్, శాంసంగ్‌ కూడా తన క్లయింట్లేనని చెప్పాడు అమన్‌. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని