HYD: అన్నార్తులకు అండగా ‘అన్నపూర్ణ’

కరోనా కష్టకాలంలో జీహెచ్‌ఎంసీ, అక్షయపాత్ర సంయుక్తంగా అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాయి. లాక్‌డౌన్‌ వేళ ఉపాధి కరవై ఇబ్బందులు పడుతున్న వారికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాయి....

Published : 19 May 2021 22:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కష్టకాలంలో జీహెచ్‌ఎంసీ, అక్షయపాత్ర సంయుక్తంగా అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాయి. లాక్‌డౌన్‌ వేళ ఉపాధి కరవై ఇబ్బందులు పడుతున్న వారికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాయి. గతంలో అన్నపూర్ణ కేంద్రాల్లో రూ.5కు భోజనం పెట్టగా.. మంగళవారం నుంచి ఉచితంగా ఆహారం అందజేస్తున్నారు. మునుపటి కంటే అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్యను 250కు పెంచి పేదల ఆకలి తీరుస్తున్నారు. 

జంటనగరాల్లో 150 కేంద్రాల ద్వారా అన్నార్తులకు జీహెచ్‌ఎంసీ భోజనం అందిస్తోంది. వీటి సంఖ్యను మరో 100కు పెంచాలని ప్రభుత్వం ఆదేశించడంతో గత మూడు రోజుల నుంచి 250 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనం పంపిణీ జరుగుతోంది. ప్రతిరోజు 45 వేల మందికి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. మెనూను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. 

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో రవాణా వ్యవస్థ అంతంతమాత్రంగానే మారింది. వ్యాపారసంస్థలు, పరిశ్రమలు, విద్యాలయాలు మూసివేశారు. దీంతో ఇబ్బంది పడుతున్న వలస కార్మికులు, చిరుద్యోగులు, రోజువారీ కూలీలు, నిరాశ్రయులు, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రధాన ఆసుపత్రులు, బస్టాండులు, రైల్వేస్టేషన్లు, కూలీల అడ్డాలు, జంక్షన్లు ఉన్నచోట అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటుచేసి ఆకలి తీరుస్తోంది. సమతుల పోషకాలతో అందిస్తున్న అన్నపూర్ణ ఉచిత భోజనం పట్ల వలస కార్మికులు, నిరాశ్రయులు, విద్యార్థులు, చిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని