GHMC: కుక్కల దాడిలో బాలుడి మృతి.. బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం

హైదరాబాద్‌లో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్‌ కుటుంబానికి జీహెచ్‌ఎంసీ రూ.10లక్షల పరిహారం ప్రకటించింది.

Updated : 28 Feb 2023 18:41 IST

హైదరాబాద్‌: ఇటీవల హైదరాబాద్‌లో కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్‌ కుటుంబానికి జీహెచ్‌ఎంసీ పరిహారం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ రూ.8లక్షలు, కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ.2లక్షలు కలిపి మొత్తం రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ప్రదీప్‌ మృతి చెందిన ఘటనను హైకోర్టు ఇప్పటికే సుమోటో పిటిషన్‌గా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కుక్కలు వీధుల్లో తిరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది. కుక్కల దాడిలో మృతి చెందిన ఘటన పరిహారానికి అర్హమైన కేసు అని, బాలుడి తల్లిదండ్రులకు పరిహారం అంశాన్ని వచ్చే విచారణలో పరిశీలిస్తామంటూ విచారణను ధర్మాసనం మార్చి 16వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని