GHMC: అగ్నిమాపక నిబంధనలు పాటించని మాల్స్‌, ఆసుపత్రులను సీజ్‌ చేస్తాం: జీహెచ్‌ఎంసీ

అగ్నిమాపక నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులు, మాల్స్‌కి జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం నోటీసులు జారీ చేసింది. 3 రోజుల్లోగా నిబంధనలు పాటించకపోతే సీజ్‌ చేస్తామని ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి తెలిపారు.

Updated : 01 Apr 2023 20:40 IST

హైదరాబాద్‌: అగ్నిమాపక నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులు, మాల్స్‌కి జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం నోటీసులు జారీ చేసింది. నగరంలోని ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, గోదాములు, స్పోర్ట్స్‌, ఫార్మా, ప్లాస్టిక్‌ దుకాణాలు, మాల్స్‌కు సంబంధించి మొత్తం 19 మందికి నోటీసులు అందజేసింది. న్యూ మలక్‌పేట డీమార్ట్‌, మాదాపూర్‌ కెనరా బ్యాంక్‌ బిల్డింగ్‌, మాదాపూర్‌ లక్కీరెస్టారెంట్‌, మెహిదీపట్నం బటర్‌ఫ్లై హాస్పిటల్‌, మదీగూడ సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌, మెహిదీపట్నం చెన్నై సిల్క్స్‌ షాపింగ్‌ మాల్‌కు నోటీసులు ఇచ్చినట్టు జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. సెల్లార్‌లు ఖాళీ చేయాలని, అత్యవసర ద్వారాలు తెరిచి ఉంచాలని నోటీసులో పేర్కొన్నారు. 3 రోజుల్లోగా నిబంధనలు పాటించకపోతే సీజ్‌ చేస్తామని ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి తెలిపారు. అక్రమంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్న సికింద్రాబాద్‌లోని ఏఎంఆర్‌ ప్లానెట్‌కు రూ.50వేల జరిమానా విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని