Jharkhand: దయ్యాలకు ఓ జాతర ఉంది.. అదెక్కడో చూద్దామా..!

మీరు ఇప్పటి వరకూ కుంభ మేళ, ఉద్యోగ మేళ, ఫుడ్ మేళాల గురించి విని ఉంటారు. కానీ ఇప్పుడు మీరు వినబోయేది గతంలో ఎప్పుడూ వినని మేళా. అదే భూత్  మేళా

Updated : 28 Apr 2022 18:22 IST

మీరు ఇప్పటి వరకూ కుంభ మేళ, ఉద్యోగ మేళ, ఫుడ్ మేళాల గురించి విని ఉంటారు. కానీ ఇప్పుడు మీరు వినబోయేది గతంలో ఎప్పుడూ వినని మేళా. అదే భూత్  మేళా. అది ఝార్ఖండ్‌ రాష్ట్రం పాలము జిల్లాలోని హైదర్‌నగర్‌ ప్రాంతం.. సమయం మిట్టమధ్యాహ్నం.. ఎండ మండిపోతోంది.. అక్కడ చూస్తే పిడకలతో వేసిన మంటల ముందు కొందరు దయ్యం పట్టిన వారిలా ఊగిపోతున్నారు. దయ్యాలను వదిలించేందుకు కొందరు పూజలు చేస్తున్నారు. తమకు దయ్యం పట్టిందని భావించే వారు అక్కడ వందల మంది ఉన్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారు ఎక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే అక్కడ భూత్‌ మేళా జరుగుతోంది మరి. ఔను మీరు విన్నది నిజమే అక్కడ జరుగుతున్నది దయ్యాల జాతర. ఇక్కడ కొన్ని దశాబ్ధాల కాలంగా భూత్‌ మేళా జరుగుతోంది. తమకు దయ్యాలు పట్టాయని భ్రమ పడేవారు, తమకు కీడు సోకిందని తలించే వారు వేలాదిగా తరలి వస్తారు. ఛైత్రీ నవరాత్రుల సమయంలో ఈమేళా నిర్వహిస్తారు. పాలముతో పాటు గర్వ, లతేహా, ఛత్ర ప్రాంతాలు ఈ దయ్యాల జాతరకు ఫేమస్‌. దేశం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తారు. బీహార్‌, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది తమ కుటుంబ సభ్యలను తీసుకుని వస్తుంటారు. దయ్యాలను వదిలించే పూజలు చేసే వారు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటారు. ప్రజలు భారీగా తరలి వచ్చినపుడు పోలీసు బందోబస్తు సైతం ఏర్పాటు చేస్తారు. సందర్శకుల కోసం మౌలిక సదుపాయాలు సైతం కల్పించడం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని