Asteroid: భూమికి సమీపంగా భారీ గ్రహశకలం!

ఈ నెల 24న భూమికి సమీపంగా ఓ భారీ గ్రహశకలం వెళ్లనుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ‘2008 గో20’గా పేర్కొంటున్న ఈ గ్రహశకల వ్యాసం 220 మీటర్లు. దాదాపు ఒక ఫుట్‌బాల్‌ స్టేడియం పరిమాణం....

Published : 22 Jul 2021 01:20 IST

ప్రమాదమేమీ లేదన్న నాసా

వాషింగ్టన్‌: ఈ నెల 24న భూమికి సమీపం నుంచి ఓ భారీ గ్రహశకలం వెళ్లనుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ‘2008 గో20’గా పేర్కొంటున్న ఈ గ్రహశకల వ్యాసం 220 మీటర్లు. అంటే దాదాపు ఒక ఫుట్‌బాల్‌ స్టేడియం పరిమాణం. ఇది భూమికి 2.87 బిలియన్‌ కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లనుంది. చంద్రుడికి, భూమికి గల మధ్య దూరంతో పోలిస్తే ఇది 8 రెట్లు అధికం. భూమి దిశగా ఈ భారీ గ్రహశకలం సెకనుకు 8 కి.మీ వేగంతో వస్తోంది. అయితే, ఆ గ్రహశకలం మన భూమిని తాకే అవకాశం లేదని నాసా స్పష్టం చేసింది. గతంలోనూ పలుసార్లు భారీ గ్రహ శకలాలు భూమికి అతి సమీపంగా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.

అయితే, ఈ గ్రహశకలపు కక్ష్యను ‘అపోలో’గా గుర్తించారు. భూమికి సమీపంగా వెళ్లే ప్రమాదకరమైన గ్రహశకలాల కక్ష్యను అపోలో కక్ష్యగా వర్గీకరిస్తారు. భూమిని తాకే అవకాశాలు లేకపోయినప్పటికీ.. ‘2008 గో20’ గమనాన్ని నిరంతరం పరిశీలిస్తున్నట్లు నాసా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని