పోలవరం ప్రాజెక్టు స్పీల్‌ వేలోకి వరద నీరు

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరగడంతో దాని ప్రభావం స్పిల్‌ ఛానెల్‌పై పడింది. స్పిల్‌ ఛానెల్‌ ఎడమ..

Published : 13 Aug 2020 10:43 IST

పోలవరం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరగడంతో దాని ప్రభావం స్పిల్‌ ఛానెల్‌పై పడింది. స్పిల్‌ ఛానెల్‌ ఎడమ గట్టుకు గండిపడి నీరు లోపలికి చేరుతోంది. 

ప్రాజెక్టులో స్పిల్‌ వే పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. స్పిల్‌ వే చుట్టూ ఉన్న గట్టును మరింత పటిష్ఠం చేశారు. వరద మరింత పెరిగినప్పటికీ స్పిల్‌ వే పనులకు ఆటంకం కలగకుండా ఇంజినీర్లు, గుత్తేదారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం స్పిల్‌వే పై గడ్డర్ల అమరిక పనులు మాత్రమే జరుగుతున్నాయి. పోలవరం మండలంలోని కొత్తూరు కడెమ్మ వంతెనపైకి వరదనీరు చేరింది. దీంతో మండలంలోని 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం పెరిగింది. ఇవాళ ఉదయం భద్రాచలం వద్ద నీటిమట్టం 32.7 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని