భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం చివరిదైన మూడో హెచ్చరికను దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

Updated : 17 Aug 2020 14:15 IST

భద్రాచలం : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం చివరిదైన మూడో హెచ్చరికను దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 60 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద భారీగా వస్తుండటంతో భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. 2013 తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

భద్రాద్రి ఏజెన్సీ అతలాకుతలం

మూడో ప్రమాద హెచ్చరిక జారీతో భద్రాద్రి ఏజెన్సీ అతలాకుతలమవుతోంది. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలకు ముంపు తీవ్రత పొంచి ఉంది. ముంపు మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుస్తు జాగ్రత్తలు చేపట్టారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు గోదావరి వరదల కారణంలో వేలాది ఎకరాల్లో పంటకు అపార నష్టం వాటిల్లింది.

నిలిచిపోయిన రాకపోకలు..
వరద పెరుగుతుండటంలో ఖమ్మం నుంచి భద్రాచలం వైపు రాకపోకలను అధికారులు అదుపు చేస్తున్నారు. భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.

కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని