Andhra News: దసరా నవరాత్రులు.. రూ.4కోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

నిడమర్రు మండలం మందలపర్రులో ఉమా నీలకంఠేశ్వరస్వామి పంచతన క్షేత్రంలో రూ. 4కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.

Published : 01 Oct 2022 10:46 IST

నిడమర్రు: దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూ భక్తిని చాటుకుంటున్నారు ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులో ఉమా నీలకంఠేశ్వరస్వామి పంచతన క్షేత్రంలో రూ. 4కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణకు రూ.2వేలు, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను ఉపయోగించారు. గత సంవత్సరం రూ.3.50 కోట్లతో అమ్మవారిని అలంకరించామని.. ఇప్పుడు రూ.4 కోట్లతో అలంకరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని