Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 10 Jun 2021 13:03 IST

1. TS News: ఐటీలో రెట్టింపు వృద్ధి: కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్ర‌గ‌తిప‌థంలో దూసుకుపోతోంద‌ని పుర‌పాల‌క‌, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీ రామారావు అన్నారు. క్లిష్ట ప‌రిస్థితుల్లో కూడా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్ర‌గ‌తి సాధించామ‌ని తెలిపారు. ఎంసీహెచ్ఆర్‌డీలో ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖల వార్షిక నివేదిక‌ను ఇవాళ కేటీఆర్ విడుద‌ల చేశారు. 2019-20లో రాష్ట్ర ఐటీ ఎగుమ‌తులు రూ.1.28 ల‌క్ష‌ల కోట్లు అని..  అదే 2020-21లో రూ.1.45 లక్ష‌ల కోట్లు అని తెలిపారు. ఐటీలో దేశంతో పోలిస్తే రెట్టింపు వృద్ధి సాధించామ‌ని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. AP News: వృద్ధులకు ఆధార్‌ లేకుండానే వ్యాక్సిన్‌

కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 26,325 మంది వైద్య, ఇతర సిబ్బందిని నియమించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, వ్యాక్సినేషన్‌ అంశాలపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. వృద్ధులకు ఆధార్‌ లేకుండానే వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం దీనిపై మెమో దాఖలు చేసింది. పూర్తి వార్తకోసం క్లిక్‌ చేయండి 

3. Corona: 94వేల కేసులు..1.51లక్షల రికవరీలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. అయితే బిహార్ ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడంతో మృతుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. బుధవారం 94,052 మంది కరోనా బారిన పడ్డారు. రెండురోజులుగా కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 2,91,83,121 చేరింది. 24గంటల్లో 6,148 మంది మృత్యుఒడికి చేరున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Covid: బిహార్‌లో లెక్కకు మించి మరణాలు

4. Kerala: కేరళలో వింత ప్రేమకథ

కేరళలో ఓ వింత ప్రేమకథ వెలుగు చూసింది. 2010 ఫిబ్రవరిలో ఓ టీనేజీ అమ్మాయి (18) ఇంటి నుంచి పారిపోయింది. అయిరూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత పదేళ్లుగా ఆమె ఎక్కడుందో ఇంట్లోవాళ్లకు తెలియలేదు. పదేళ్ల తర్వాత బయటపడ్డ విచిత్రం ఏమిటంటే.. పుట్టింటికి సమీపంలో ఉన్న ఓ అబ్బాయి ఇంటి దగ్గరే ఆమె ఉంటోంది. ఇందులో మరో విశేషం చెప్పాలంటే.. ఆమె అక్కడున్న విషయం అబ్బాయి ఇంట్లోవాళ్లకు కూడా తెలియదట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* TS News: ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌

5. తుపాన్లను మరింత ముందుగా కనిపెట్టొచ్చు

ఉష్ణ మండల తుపాన్లను ముందస్తుగా పసిగట్టేందుకు ఓ సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరించింది. తుపాను రావడానికి ముందు సముద్రాల్లో ఏర్పడే సుడిగుండాల ఆనవాళ్లను ఉపగ్రహ చిత్రాల కన్నా ముందుగానే కనిపెట్టడం, తుపాను ఏ ప్రాంతంలో, ఏ సమయంలో సంభవించనుందో గుర్తించడం ఈ విధాన ఉద్దేశం అని శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. America: 8 కోట్ల డోసుల్లో భారత్‌కు వాటా..

కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా అమెరికా ప్రపంచ దేశాలకు ఎనిమిది కోట్ల కరోనా డోసులను అందించనుంది. దీనిలో భాగంగా భారత్‌కు కూడా టీకాలు రానున్నాయి. ఈ విషయాన్ని ఆ దేశ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి వెల్లడించారు. ‘టీకా డోసులు భారత్‌కు ఎప్పుడు చేరుకుంటాయనే అంశంపై కచ్చితమైన వివరాలు లేవు. అయితే, ఎనిమిది కోట్ల డోసుల్లో భారత్‌ తన వాటాను అందుకోనుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా భాగస్వాములతో కలిసిపని చేసే విషయంలో నిబద్ధతను ప్రదర్శించాం’ అని స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నెడ్ప్రైస్ మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. Sushil Kumar: సుశీల్‌ ఎలా దాడి చేశాడంటే..!

యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు సుశీల్‌ కుమార్‌ ఏం చేశాడు? ఎందుకు చేశాడు? ఎవరెవరిని బంధించాడు? వంటి వివరాలపై స్పష్టత లభిస్తోంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, సాగర్‌ మిత్రుడు సోనూ మహల్‌ మే 5న సుశీల్‌ ఏం చేశాడో మీడియాకు వివరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. పొదుపు ఖాతాపై అధిక వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తున్న‌ 3 బ్యాంకులు, వ‌డ్డీ రేట్ల వివ‌రాలు 

బ్యాంకు లావాదేవీలు నిర్వ‌హించే ప్ర‌తీ ఒక్క‌రికీ ప్రాధ‌మికంగా ఉండాల్సింది పొదుపు ఖాతా. అందువ‌ల్ల ప్ర‌తీ వ్య‌క్తి ఈ ఖాతాలో న‌గ‌దు డిపాజిట్ చేస్తే వ‌డ్డీ ఎంత వ‌స్తుందో తెలుసుకోవాలి.  అధిక వ‌డ్డీనిచ్చే బ్యాంకు పొదుపు ఖాతాను ఎంచుకుంటే మంచి రాబ‌డి వ‌స్తుంది. ఆర్‌బీఎల్ బ్యాంక్‌, బంధ‌న్ బ్యాంక్‌, య‌స్ బ్యాంక్‌.. ఈ మూడు ప్రైవేట్ రంగ బ్యాంకులు పొదుపు ఖాతాల‌పై అధిక వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి 

9. US: భారతీయ అమెరికన్లపై వివక్ష..!

అమెరికాకు వలస వెళ్లి నివసించే వారిలో సంఖ్యాపరంగా భారతీయులది రెండో స్థానం. కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఆవాసం ఉంటున్నప్పటికీ, వారి సంతానం అమెరికాలోనే జన్మించి పౌరసత్వం పొందినప్పటికీ వివక్ష భావన ఎదురవుతూనే ఉందని బుధవారం విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది. జాతీయ ప్రాతినిధ్య విధానం ఆధారంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో 1200 మంది భారతీయ అమెరికన్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. మాస్కుల్లేని వ్యక్తుల ముచ్చట్లు ప్రమాదకరం

నాలుగు గోడల మధ్య కూర్చుని ముచ్చట్లు చెప్పుకొనే వ్యక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మాస్కులేని వ్యక్తి మాట్లాడుతున్న సమయంలో నోటి నుంచి, శ్వాసించే సమయంలో ముక్కు నుంచి వెలువడే నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ తుంపరుల నుంచి కరోనా వైరస్‌ గాలిలోకి వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. అలా వచ్చిన వైరస్‌ అధిక సమయం పాటు గది వాతావరణంలో తేలియాడుతుందని, ఇతరులకు సులభంగా అది సంక్రమిస్తుందని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని