Food Habits: మన ఆహార అలవాట్లతోనే ఆరోగ్యం..! ఎలాగో తెలుసా..?

మన ఆహారమే మనకు మిత్రుడు..రోజూ తినే ఆకు, కూరగాయలతోనే కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి లభిస్తాయి. జబ్బులను కూడా నియంత్రించడమే కాకుండా అవి రాకుండా అడ్డుకునే శక్తి మనకు ఆహారంతోనే వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. సమతుల ఆహారం ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

Published : 07 Oct 2022 00:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన ఆహారమే మనకు మిత్రుడు..రోజూ తినే ఆకు, కూరగాయలతోనే కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి లభిస్తాయి. జబ్బులను కూడా నియంత్రించడమే కాకుండా అవి రాకుండా అడ్డుకునే శక్తి మనకు ఆహారంతోనే వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. సమతుల ఆహారం ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. వేళకు తినకుండా ఏదో తిన్నామనే భావనతో చాలా మంది ఉంటారని న్యూట్రిషనిస్టు డాక్టర్‌ స్వరూపారాణి తెలిపారు.

ఎలా తింటే మంచిదంటే..

బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల చాలా మంది అల్పాహారం కాకుండా మధ్యాహ్న భోజనమే నేరుగా చేస్తున్నారు. మధుమేహం ఉన్న వారు పోషకాలు అధికంగా ఉండే ఆహారం తినాల్సిందే. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం12 గంటల వరకు తినాలి. లేకపోతే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. రాత్రిపూట ఆహారం తక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్నం సమతుల ఆహారం తీసుకోవాలి. గుడ్డు, పనీర్‌లలో ఎక్కువ పోషకాలుంటాయి. కనీసం ఒక పండు ఏదైనా తినాలి. ప్రకృతిలో లభించే ఆహారంలో అన్ని రకాల రంగులుండేవి తినాలి. ఉపవాసం చేసినపుడు శరీరంలోని చెడు వ్యర్థాలు బయటకు వస్తాయి. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండొచ్చు. దీర్ఘకాలంగా ఉపవాసం ఉండటం మంచిది కాదు. రోజూ 14 గ్లాసుల నీటిని తాగాలి. గబగబ తినడంతో గ్యాస్‌ సమస్య వస్తుంది. జీర్ణం కావడం ఆలస్యమవుతుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని