Telangana News: రైతులకు శుభవార్త.. ఈనెల 28 నుంచి రైతు బంధు సాయం

తెలంగాణలో రైతులకు ఈనెల 28 నుంచి యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు సాయం అందనుంది. ఈమేరకు సీఎం కేసీఆర్‌ ఆర్థికమంత్రిని ఆదేశించారు.

Updated : 18 Dec 2022 17:08 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రైతుబంధు సాయం ఈనెల 28 నుంచి రైతులకు అందనుంది. యాసంగి పెట్టుబడి సాయాన్ని ఈనెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. ఎప్పటి లాగే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను ప్రభుత్వం జమచేయనుంది. తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. యాసంగి సీజన్‌కు రైతు బంధు కింద రూ.7,600 కోట్లు సాయం అదించే అవకాశం ఉంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని