Telangana News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 2,391 పోస్టుల భర్తీకి అనుమతి
తెలంగాణలో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీని నెరవేరుస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో 2,391 పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. గురుకులాలు, సమాచార పౌరసంబధాలశాఖలో వివిధ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగార్థులకు మరో శుభవార్త అన్న ఆర్థికశాఖమంత్రి హరీశ్‌రావు.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీని నెరవేరుస్తోందని తెలిపారు. బీసీ గురుకుల విద్యాలయాల్లో 1499 పోస్టులను గురుకులాల నియామక మండలి ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో 480 లెక్చరర్లు, 324 టీజీటీ, 235 పీజీటీ, 185 జూనియర్ లెక్చరర్, 60 ల్యాబ్ అసిస్టెంట్, 37 లైబ్రేరియన్, 33 ఆర్ట్-క్రాఫ్ట్-మ్యూజిక్ టీచర్, 30 కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, 33 పీఈటీ, 10 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి.
మరో 63 స్టాఫ్ నర్స్ పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ నియామకమండలి ద్వారా భర్తీ చేయనున్నారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో గ్రూప్-3, గ్రూప్-4 కింద 12 చొప్పున జూనియర్ అసిస్టెంట్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 417 జూనియర్ లెక్చరర్ పోస్టులు గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 87 టీజీటీ, 6 ఆర్ట్-క్రాఫ్ట్-మ్యూజిక్ టీచర్ పోస్టులను గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. సమాచార, పౌరసంబంధాల శాఖలో 166 పోస్టులను పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. అందులో 4 పీఆర్వో, 16 ఏపీఆర్వో, 82 పబ్లిసిటీ అసిస్టెంట్, 41 అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్, 22 ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
పసిపాప ఆకలి తీర్చేందుకు.. 10 కిలోమీటర్ల ప్రయాణం!
-
Crime News
vizag: విశాఖ రామజోగయ్యపేటలో కూలిన మూడు అంతస్తుల భవనం.. బాలిక మృతి
-
India News
కొంగ మీది బెంగతో.. యువరైతు కంటతడి
-
Sports News
హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్