HMDA: భూముల వేలానికి అనూహ్య స్పందన.. అత్యధికంగా గజం రూ.1.11 లక్షలు

హెచ్‌ఎండీఏ నిర్వహించిన భూమల కొనుగోలుకు స్థిరాస్తి వ్యాపారులు ఆసక్తి కనబరిచారు. దీంతో అత్యధికంగా గజం రూ.1.11 లక్షల ధర పలికిందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

Published : 19 Jan 2023 01:36 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (HMDA) నిర్వహించిన భూముల వేలానికి మంచి ఆదరణ లభించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలం ద్వారా రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 9 చోట్ల భూములను విక్రయించారు. ఈ విక్రయాల ద్వారా రూ.195.24 కోట్ల ఆదాయం వచ్చినట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. స్థిరాస్తి వ్యాపారులు భూముల కొనుగోలుకు ఆసక్తి చూపడంతో అత్యధికంగా గజం రూ.1.11లక్షల ధర పలికింది. రెండో దశ భూముల అమ్మకాలకు మరో 3 రోజుల తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని