పట్టాలు తప్పిన గూడ్స్‌.. విశాఖ-భువనేశ్వర్‌ రూట్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఒడిశాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ-భువనేశ్వర్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Updated : 25 May 2023 13:18 IST

పలాస, బ్రహ్మపుర: ఒడిశాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ-భువనేశ్వర్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒడిశాలోని ఛత్రపూర్‌-గంజాం రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలు ఇంజిన్‌ పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా డివిజన్‌ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు. 

గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో శ్రీకాకుళం రోడ్‌, పలాస, సోంపేట, ఇచ్ఛాపురంతో పాటు ఒడిశాలోని బ్రహ్మపుర, ఛత్రపూర్‌ స్టేషన్లలో పలు రైళ్లను నిలిపేశారు. సుమారు 2 గంటలుగా రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తిచేస్తున్నామని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని