Andhra news: ఏపీలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు.. మంత్రి గొట్టిపాటి తొలిసంతకం

రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తొలి సంతకం చేశారు.

Published : 22 Jun 2024 16:37 IST

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తొలి సంతకం చేశారు. ఏపీ సచివాలయంలో శనివారం ఆయన ఇంధనశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు దశలవారీగా సోలార్‌ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దస్త్రంపై రెండో సంతకం చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంలో భాగంగా ఇంటింటికీ 3 కిలోవాట్ల సోలార్‌ విద్యుత్‌ అందించే దస్త్రంపై మూడో సంతకం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా.. డిమాండ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. దేశంలో విద్యుత్ సంస్కరణలను మొదటిగా ప్రారంభించింది చంద్రబాబేనని అన్నారు. దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ విద్యుత్ శాఖను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను అస్తవ్యస్తంగా మార్చిందని, 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని