Published : 31 Jan 2022 01:02 IST

Andhra news : ఉద్యోగుల జీతాల ప్రాసెసింగ్‌పై ప్రభుత్వం కీలక ఆదేశాలు

అమరావతి : ఉద్యోగుల జీతాల ప్రాసెసింగ్‌పై ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రాసెసింగ్‌ బాధ్యతను డీడీవోల కంటే పైస్థాయి అధికారులకు అప్పగించింది. ఈ మేరకు కలెక్టర్లు, హెచ్‌ఓడీలు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీస్‌ రిజిస్టర్‌ లేకపోవడంతో పలు జిల్లాల్లో బిల్లుల ప్రాసెసింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బిల్లులు ప్రాసెస్‌ చేయలేమని జిల్లా ట్రెజరీ అధికారులు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. కొత్త జీతాలు వద్దని ఉద్యోగులు లేఖలు ఇస్తున్నారని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఇవాళ సెలవురోజూ బిల్లులు ప్రాసెస్‌ చేసేందుకు అధికారులు యత్నించారు. ప్రాసెస్‌ కాని బిల్లులపై అధికారాలు బదలాయిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇబ్బందుల కారణంగా బిల్లుల ప్రాసెస్‌ పూర్తి కాలేదు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని