Andhra News: సీపీఎస్‌పై చర్చిద్దాం రండి.. ఉద్యోగ సంఘాలను ఆహ్వానించిన ప్రభుత్వం

సీపీఎస్‌ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించింది...

Published : 17 Aug 2022 22:12 IST

అమరావతి: సీపీఎస్‌ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించింది. నాలుగు ప్రధాన ఉద్యోగ సంఘాలతో పాటు సీపీఎస్‌కు చెందిన ఉద్యోగ సంఘాలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం సాయంత్రం 5గంటలకు సచివాలయంలో సంప్రదింపుల కమిటీతో సమావేశానికి రావాల్సిందిగా ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం పలికింది. సచివాలయం రెండో బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమావేశం జరగనుంది. సెప్టెంబరు 1న సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటించడంతో అత్యవసరంగా సీపీఎస్‌ రద్దు అంశంపై ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని