Telangana News: ఆర్పీఎఫ్‌ కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్‌ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

ఈనెల 18న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై దాడి సందర్భంగా ఆర్పీఎఫ్‌ కాల్పుల్లో వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం డబీర్‌పేటకు చెందిన దామెర రాకేశ్‌ మృతి చెందిన విషయం

Updated : 24 Jun 2022 22:27 IST

హైదరాబాద్‌: ఈనెల 18న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై దాడి సందర్భంగా ఆర్పీఎఫ్‌ కాల్పుల్లో వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం డబీర్‌పేటకు చెందిన దామెర రాకేశ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే.  రాకేశ్‌ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌... రాకేశ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. అతని కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అందుకనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆదేశాలమేరకు రాకేశ్‌ సోదరుడు రామరాజును తగిన పోస్టులో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కారుణ్య నియామకం కింద జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని