Andhra News: సీపీఎస్ కంటే జీపీఎస్ మరింత ప్రమాదకరం: ఉద్యోగ సంఘాలు
సీపీఎస్‌పై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు మరోసారి విఫలమయ్యాయి. చర్చలకు పిలిచిన ప్రభుత్వం
అమరావతి: సీపీఎస్‌పై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు మరోసారి విఫలమయ్యాయి. చర్చలకు పిలిచిన ప్రభుత్వం మళ్లీ పాతపాటే పాడిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఉద్యోగులకు సీపీఎస్ అనేది ఎంత ప్రమాదకరమో ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ అంతకుమించి ప్రమాదకరమని ఏపీ సీపీఎస్ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. ఈ అంశాన్ని సంప్రదింపుల కమిటీకి తెలియజేశామన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగి రాజ్యాంగబద్ధ హక్కుగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబరు1న నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓపీఎస్ పునరుద్ధరించాలన్నదే ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. సీపీఎస్ విధానంలో వచ్చిన ఏ సవరణనూ ఈ రాష్ట్రంలో అమలు చేయడంలేదని పేర్కొన్నారు. జీపీఎస్ అమలైతే దాని పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్నారు. చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా తమ వేదనను ప్రభుత్వానికి మరోసారి తెలియజేస్తామన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ చేసే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్