U-19 world cup: అండర్‌-19 ప్రపంచకప్‌లో యువభారత్ బోణీ

అండర్‌ - 19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌ లో యువభారత్‌ తన సత్తా చాటింది. భారత్‌ దక్షిణాఫ్రికాకు నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది.

Updated : 16 Jan 2022 11:50 IST

మొదటి వన్డేలో దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా విజయం

భారత్‌ 233.. దక్షిణాఫ్రికా 188

గయానా: అండర్‌ - 19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో యువభారత్‌ సత్తా చాటింది. దక్షిణాఫ్రికాపై 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 46.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్‌ నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు ఛేదించలేకపోయింది. 45.4 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే భారత్‌ షాకిచ్చింది. తొలి ఓవర్‌ నాలుగో బంతికే జాన్ కన్నింగ్‌హమ్‌ (0)ను రాజ్‌వర్థన్ హంగర్‌గెకర్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత భారత బౌలర్లు విక్కీ (5/28), బవా (4/47) వరుసగా వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికా జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు. రాజ్‌వర్థన్ హంగర్‌గెకర్ ఒక వికెట్ తీశాడు. ఐదు వికెట్లు తీసిన విక్కీ ఓస్వాల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు. 

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. 

స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయిన భారత్‌ను సారథి, ఉపసారథి ఆదుకున్నారు. కెప్టెన్‌ యాష్‌ ధుల్‌ (82), రషీద్‌ (31) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద ఓపెనర్లు రఘువన్షి (5), హర్నూర్ సింగ్ (1) ఔటయ్యారు. ఆ తర్వాత యాష్-రషీద్‌ కలిసి మూడో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. వీరితో పాటు నిశాంత్ సింధు (27), రాజ్ బవా (13), కౌశల్ తంబే (35) రాణించడంతో.. జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. చివర్లో కెప్టెన్‌ యశ్‌ రనౌట్ కావడం.. మిగతా బ్యాటర్లు త్వరగా పెవిలియన్‌కు చేరడంతో 46.5 ఓవర్లలో 232 పరుగులకే భారత్‌ పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు మాథ్యూ బోస్ట్ 3 వికెట్లు తీయగా.. అఫీవ్ నియాండా, డేవిడ్ బ్రవీస్ చెరో రెండు వికెట్లు తీశారు. లియామ్ ఎల్డర్, మిక్కీ కోప్‌లాండ్ చెరో వికెట్ దక్కాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని