TSPSC: పేపర్‌ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో తాజా నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై ఆదేశించారు.

Published : 23 Mar 2023 21:08 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్‌ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై ఆదేశించారు. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలంటూ సీఎస్‌ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌కు గవర్నర్‌ లేఖలు రాశారు. లీకేజీ అంశంలో సిట్‌ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పరీక్షలు రాసిన టీఎస్‌పీఎస్సీ సిబ్బంది వివరాలు, పరీక్ష రాసిన రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగుల ఫలితాలతో సహా అన్ని వివరాలు నివేదికలో పొందుపరచాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు