సూర్యాపేట ఘటనపై గవర్నర్‌ తీవ్ర దిగ్భ్రాంతి 

సూర్యాపేటలో జాతీయ స్థాయి జూనియర్‌ కబడ్డీ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో చోటుచేసుకున్న ప్రమాదంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి.......

Published : 23 Mar 2021 01:20 IST

హైదరాబాద్‌: సూర్యాపేటలో జాతీయ స్థాయి జూనియర్‌ కబడ్డీ క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో చోటుచేసుకున్న ప్రమాదంపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అధికారులను వివరాలు అడిగి ఆమె తెలుసుకున్నారు. 
బాధితులకు మంత్రి పరామర్శ
ప్రమాదంలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు లింగయ్య, సైదిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని చెప్పారు. 

కాంగ్రెస్‌ శ్రేణులు బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: ఉత్తమ్‌
సూర్యాపేటలో గ్యాలరీ కుప్పకూలి ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వంద మందికిపైగా గాయపడటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. 

గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి: శ్రీనివాస్‌ గౌడ్‌

సూర్యాపేట స్టేడియం ప్రమాదం పట్ల రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరును క్రీడా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని