వేగవంతంగా వ్యాక్సిన్‌ పంపిణీ

వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేసేందుకు ఎగుమతులు, దిగుమతులపై ఉన్న పరిమితులను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) తెలిపింది.

Published : 02 Jan 2021 00:04 IST

దిల్లీ: వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేసేందుకు ఎగుమతులు, దిగుమతులపై ఉన్న పరిమితులను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) తెలిపింది. ఎక్స్‌ప్రెస్‌ కార్గో క్లియరెన్స్‌ సిస్టం (ఈసీసీఎస్‌) సర్వీసులనందించే ప్రాంతాల్లో ఈ పరిమితులు తొలగించినట్లు వెల్లడించింది. కొవిడ్‌-19తో ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కొందని.. వ్యాక్సిన్‌ పంపిణీని వీలైనంత వేగవంతం చేయాలని సీబీఐసీ తెలిపింది. వ్యాక్సిన్లను తగిన ఉష్ణోగ్రతలో రవాణా చేయాల్సి ఉంటుందని.. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొంది. వ్యాక్సిన్ల రవాణాకు ప్రత్యేకమైన కంటైనర్లను వాడనున్నామని తెలిపింది.

వీటిలో వ్యాక్సిన్లకు అవసరమైన ఉష్ణోగ్రతలను పర్యవేక్షించేందుకు, ట్రాక్‌ చేసేందుకు ప్రత్యేకమైన వ్యవస్థలు ఉంటాయని సీబీఐసీ వెల్లడించింది. వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐసీ కేంద్రాన్ని కోరింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీల్లో ఉన్న ఒడుదొడుకులను కేంద్రం గమనించి భారత్‌లో అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఏఎమ్‌ఆర్జీ అసోసియేట్‌ పార్టనర్‌ రజత్‌ మోహన్‌ తెలిపారు. ఎగుమతులు, దిగుమతులపై ఉన్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారన్నారు.

ఇవీ చదవండి..

కొవిడ్‌ టీకా.. ఎన్నిరోజులకు ఇమ్యునిటీ వస్తుందంటే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని