Andhra news: ఐపీఎస్‌ అధికారి గరికపాటి బిందు మాధవ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

ఐపీఎస్‌ అధికారి గరికపాటి బిందు మాధవ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 16 Jun 2024 18:47 IST

అమరావతి: ఐపీఎస్‌ అధికారి గరికపాటి బిందు మాధవ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో అల్లర్లు జరిగాయి. హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో అప్పటి పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న బిందు మాధవ్‌ను  సస్పెండ్‌ చేస్తూ గతంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఘటనలు జరిగిన తీరుపై ఐపీఎస్‌ అధికారి బిందు మాధవ్‌ వివరణ ఇచ్చారు. వివరణను పరిశీలించిన అనంతరం సంతృప్తి చెందిన అధికారులు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని