Indian Constitution:‘భారత రాజ్యాంగం’పై కేంద్రం ఉచిత కోర్సు!

భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉచిత ఆన్‌లైన్‌ కోర్సును ప్రవేశపెట్టింది. నేడు ‘భారత రాజ్యంగ దినోత్సవం’ పురస్కరించుకొని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘అజాదీ కా అమృత్‌ మహోత్సవం’లో భాగంగా ఈ కోర్సును

Updated : 20 Oct 2022 11:54 IST

దిల్లీ: భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉచిత ఆన్‌లైన్‌ కోర్సును ప్రవేశపెట్టింది. నేడు ‘భారత రాజ్యంగ దినోత్సవం’ పురస్కరించుకొని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం’లో భాగంగా ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు వెల్లడించారు.

ఈ ఉచిత ఆన్‌లైన్‌ కోర్సును కేంద్ర న్యాయ వ్యవహారాల విభాగం, కేంద్ర న్యాయశాఖ, నేషనల్‌ అకాడమీ ఆఫ్ లీగల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌(నల్సార్‌), హైదరాబాద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో సంయుక్తంగా అందిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ కోర్సులో చేరే అవకాశముంది. ఆసక్తిగలవారు  www.legalaffairs.nalsar.ac.in వెబ్‌సైట్‌లో తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సులో చేరిన అభ్యర్థులకు వెబ్‌సైట్‌లో 15వీడియోలు చూసేందుకు అనుమతిస్తారు. వాటిలో భారత రాజ్యాంగానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. అంతేకాదు.. రాజ్యాంగ రచన, అమలు, తర్వాత చోటుచేసుకున్న పరిణామ క్రమాన్ని వివరిస్తారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఆటోమెటిక్‌గా సర్టిఫికేట్‌ జనరేట్‌ అవుతుంది. అయితే, ఆ సర్టిఫికేట్‌ పొందాలంటే నామమాత్రపు ఫీజుగా రూ. 100 చెల్లించాలి.

Read latest General News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని